విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి తీసి, ఆ తర్వాత అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి… సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా ఒక సంచలనం అయ్యాడు. అయితే ఆ దర్శకుడికి ఇప్పుడు హీరో దొరకడం లేదు. రణబీర్ కపూర్ ఆసక్తి చూపించినా కానీ ఆ తర్వాత తప్పుకున్నాడు. మహేష్, ప్రభాస్ కోసం ప్రయత్నాలు చేసినా కానీ వారి సమ్మతం దక్కలేదు.
దీంతో మరో స్టార్ హీరో కోసం సందీప్ అన్వేషిస్తున్నాడు. తను కావాలంటే విజయ్ దేవరకొండతో ఎప్పుడైనా సినిమా చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి కాంబినేషన్ అంటే క్రేజ్ కి లోటుండదు. పైగా ఇద్దరు కలిసి చేస్తే పాన్ ఇండియా రిలీజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయినా కానీ ఎందుకో సందీప్ రెడ్డి పెద్ద స్టార్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. బహుశా విజయ్ దేవరకొండ మిడ్ రేంజ్ స్టార్ కనుక అతని కోసం ప్రయత్నాలు చేయడం లేదేమో తెలీదు.
కానీ విజయ్ మాత్రం అతనితో పని చేయడానికి తహతహగా ఉన్నట్టు పబ్లిక్ వేదికపై చెబుతున్నాడు. తాను కోరుకుంటున్న వంద కోట్ల హీరోలు దొరకకపోతే మళ్ళీ దేవరకొండతో చేస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates