వరస ఫ్లాపులు వెంటాడుతున్నప్పుడు బాలయ్య బాక్సాఫీస్ స్టామినాని బయట పెట్టిన బ్లాక్ బస్టర్ గా అఖండ అంటే అభిమానులకే కాదు మూవీ లవర్స్ కి సైతం ఒక స్పెషల్ మెమరీ. అక్కడి నుంచి వెనుదిరిగి చూసే అవసరం లేకుండా బాలకృష్ణ వరస హిట్లతో దూసుకుపోతూనే ఉన్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా ప్రతి ఒక్కటి విజయం అందుకున్నవే. ఇంతటి ట్రాక్ రికార్డు వేసిన అఖండకు సీక్వెల్ అంటే అంచనాలు మాములుగా ఉంటాయా. దర్శకుడు బోయపాటి శీనుతో ముచ్చటగా నాలుగోసారి జట్టు కట్టిన బాలయ్య ఈసారి మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు.
జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే టీజర్ ని కానుకగా ఇచ్చారు. కథేంటో రివీల్ చేయకపోయినా బొమ్మ ఏ స్థాయిలో ఉండబోతోందో విజువల్స్ ద్వారా చిన్న శాంపిల్ అయితే చూపించారు. ఎత్తైన మంచు కొండల్లో నిలువునా రౌద్రం నిండిన అఘోరా ఒంటి మీదకు పదుల సంఖ్యలో మెషీన్ గన్లు పట్టుకున్న శత్రువులు దాడి చేస్తారు. వాళ్ళను అంతమొందిస్తూ దీనికి కారణమైన వాడికి వార్నింగ్ ఇచ్చే సీన్ లో అఖండ విశ్వరూపం చూపించారు. మొదటి భాగం గెటప్ లో చివరి షాట్ లో చూపించగా మిగిలినదంతా కొత్తగా ఉంది. బాలయ్య దుస్తులు, ఆయుధాలు అన్నీ మారిపోయాయి.
అంచనాలకు తగ్గట్టే బోయపాటి శీను అఖండ 2తో తాండవం చేయించబోయే భీభత్సాన్ని అభిమానులకు కిక్కిచ్చేలా అందించాడు. యముడైనా సరే శివాజ్ఞ లేనిదే ఏం చేయలేరనే సంభాషణతో కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పారు. ఆది పినిశెట్టి కళ్ళను మాత్రమే రివీల్ చేసి గెటప్ దాచేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించినట్టే కంటెంట్ కు తగ్గట్టు ఎలివేషన్లు పెంచేలా సాగింది. ఇతర క్యాస్టింగ్ ఎవరినీ చూపించలేదు. విడుదల తేదీ విషయంలో జరుగుతున్న చర్చలకు చెక్ పెడుతూ సెప్టెంబర్ 25 విడుదల చేయబోతున్నట్టు మరోసారి ధృవీకరించారు. సో పవన్ కళ్యాణ్ ఓజితో క్లాష్ ఆన్ లో ఉన్నట్టే.
This post was last modified on June 9, 2025 6:27 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…