జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తొలి కలయికలో రూపొందుతున్న వార్ 2 రెండు నెలల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు ఊపందుకున్నాయి. ట్రేడ్ టాక్ ప్రకారం ఏపీ తెలంగాణలో యష్ రాజ్ ఫిలింస్ స్వంతంగా రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్న వార్త రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. థియేటర్ వేల్యూ 90 కోట్ల దాకా ఉంటుందని అంతర్గత సమాచారం. మాములుగా అయితే ఇది తారక్ ఇమేజ్ కి ఈజీగా రికవర్ చేసే మొత్తం. కానీ హృతిక్ తో పాటు దర్శకుడు, కంటెంట్ అన్నీ బాలీవుడ్ ఫ్లేవర్ లో ఉండటం వల్ల కేవలం జూనియర్ ఇమేజ్ ఒకటే మార్కెటింగ్ కి సరిపోదు.
మాములుగా ఇతర నిర్మాతలకు డబ్బింగ్ హక్కులు అమ్మేయడం వల్ల యష్ సంస్థ ఆశించిన సొమ్మును సులభంగా రాబట్టుకోవచ్చు. కానీ స్వంతంగా పంపిణీ చేయడం ద్వారా రిస్కులను ఎదురు కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంపిటీషన్ లో ఉన్న కూలీని తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. ప్రమోషన్ల పరంగా చూస్తే వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ కన్నా కూలి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అన్ని రకాలుగా డామినేషన్ చూపిస్తున్నాడు. బ్రాండ్ పరంగా కూడా సౌత్ లో ఎక్కువ గుర్తింపు ఉన్నది లోకేష్ కే. రజనితో పాటు నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి ఆకర్షణలు విపరీతంగా బజ్ ని పెంచేస్తున్నాయి.
ఇలాంటి సిచువేషన్ లో వార్ 2 సర్వశక్తులనూ ఒడ్డాల్సి ఉంటుంది. ప్రమోషన్ల వరకు తారక్ ఎంత ముందుండి నడిపించినా అదొక్కటే చాలదు. ఒకవేళ ఇదే తన సోలో హీరో మూవీ అయ్యుంటే దేవర లాగా లెక్క వేరుగా ఉండేది. హిందీ సినిమా అనే ముద్ర ఖచ్చితంగా ప్రభావం చూపించేదే. అందులోనూ స్పై బ్యాక్ డ్రాప్ కావడంతో తెలుగు మాస్ జనాలను ఆకట్టుకోవడం ఒక రకంగా పెద్ద టాక్. దీన్ని యష్ సంస్థ ఎలా దాటుకుంటుందో చూడాలి. టీజర్ కొచ్చిన రెస్పాన్స్ ఎలా ఉన్నా ట్రైలర్ తో అంచనాలన్నీ మారిపోతాయని టీమ్ అంటోంది. దేశవ్యాప్తంగా ఆల్రెడీ థియేటర్ అగ్రిమెంట్లు మొదలైనట్టు సమాచారం.
This post was last modified on June 7, 2025 12:33 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…