ప్రతి హీరో అభిమానులకు ఏదో ఒక డిజాస్టర్ మర్చిపోలేని విధంగా ఉంటుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఠక్కున గేమ్ ఛేంజర్ అనేస్తారు. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో మూడేళ్ళకు పైగా సమయం తీసుకుని ప్యాన్ ఇండియా దర్శకుడు శంకర్ తీసిన ఈ విజువల్ గ్రాండియర్ ఎంత దారుణంగా పోయిందో మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. ఆఖరికి శాటిలైట్, ఓటిటిలో వచ్చినా జనం లైట్ తీసుకున్నారంటే ఏ స్థాయి ఫ్లాపో చెప్పనక్కర్లేదు. తప్పెవరిది అంటే అందరి వేళ్ళు శంకర్ వైపే వెళ్లడం సహజం. దానికి ఊతం ఇచ్చేలా ఇటీవలే ఎడిటర్ షామీర్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న మాటలు వైరలవుతున్నాయి.
ఆయన చెప్పిన ప్రకారం గేమ్ ఛేంజర్ ఒరిజినల్ రన్ టైం 7 గంటల 25 నిముషాలు. దాన్ని షామీర్ 3 గంటలకు కుదించారు. అప్పటికే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. తనకు వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో బయటికి రావడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. ఇంకా చేయాల్సిన పని పెండింగ్ ఉన్నా సరే తప్పలేదు. కానీ శంకర్ తో పనిచేయడం చాలా ఇబ్బందిగా అనిపించి, ఏ మాత్రం సంతృప్తి కలిగించలేదని శామీర్ చెప్పడం అందరిని షాక్ కు గురి చేస్తోంది. నిజానికి శంకర్ టీమ్ లో ఉండటం అదృష్టంగా భావించే నటీనటులు, టెక్నీషియన్లు ఇప్పటికీ అన్ని భాషల్లో బోలెడు మంది ఉన్నారు.
అయినా ఏడున్నర గంటల ఫుటేజ్ అంటే ఎందరు ఆర్టిస్టుల కాల్ షీట్లు, బడ్జెట్లు, షెడ్యూళ్లు, పెట్టుబడులు, వడ్డీలు వృథా అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే చాలాసార్లు సినిమా విడుదల వాయిదా పడుతూ వెళ్ళింది. శంకర్ సైతం ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ అయిదు గంటలకు పైగా వచ్చిందని అన్నారు కానీ ఇప్పుడు శామీర్ మాటలు చూస్తే దానికన్నా రెండు గంటలు ఎక్కువే ఉండటం కొసమెరుపు. దీని వల్ల నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. గుడ్డిగా డైరెక్టర్లను నమ్మేసి వాళ్ళు చెప్పినట్లల్లా చేసుకుంటూ పోతే ఇదిగో ఇలాంటి గేమ్ చేంజర్లే వస్తాయి. ఒక్కోసారి అతి నమ్మకం ప్రమాదమే.
This post was last modified on May 24, 2025 2:49 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…