సాహో సినిమా విడుదలకు ముందే రాధే శ్యామ్ షూటింగ్ కొంతవరకు పూర్తి చేసారు. అయితే సాహో పరాజయం తర్వాత కథలో మార్పుచేర్పులు అవసరమని చాలా సమయం వృధా చేసారు. తీరా కొత్తగా రాసుకున్నది తీయడానికి వెళ్లేసరికి కరోనా బూచి భయపెట్టడంతో మిగిలిన సినిమాలతో పాటు దానిని కూడా ఆపేసారు.
లాక్డౌన్లో రాధేశ్యామ్ చిత్రాన్ని త్వరగా ముగించాలంటే ముందు తీసిన సీన్లు అలాగే వుంచేయాలని డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత చేసిన మార్పు చేర్పులు పట్టించుకోకుండా ముందు అనుకున్న కథతో వెళ్లిపోతున్నారట. దీని వల్ల అప్పుడు తీసిన ఫుటేజీ ఏదీ వృధా అవదు కనుక షూటింగ్ త్వరగా పూర్తి చేసేయవచ్చునని భావించారట. అందుకే ఈ చిత్రం సమ్మర్ టైమ్‌కి రెడీ అయిపోతుందని ధీమాగా వున్నారు.
ఈ చిత్రాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్టులను ప్రభాస్ మొదలు పెట్టవచ్చు. రాధేశ్యామ్‌ని చెక్కడం మీద ఫోకస్ చేయకుండా ముందు షూటింగ్ పార్ట్ ఫినిష్ చేయడంపై ప్రభాస్ దృష్టి పెట్టాడు. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన చిత్ర బృందం తరువాతిషెడ్యూల్ ఇక్కడే పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates