టాలీవుడ్ ఎగ్జిబిషన్ రంగంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన ఏపి తెలంగాణ సంయుక్త ఎగ్జిబిటర్ల మావేశంలో జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చిన వార్తలు సంచలనం రేపుతున్నాయి. అద్దెల ప్రాతిపదికన నడపడం కష్టంగా ఉందని పర్సెంటేజ్ విధానంలోనే ఇకపై వ్యాపారం చేయాలనే ప్రతిపాదనతో పంపిణీదారులంతా ఒకే మాట మీద ఉన్నారని సమాచారం. ఈ రోజు మీటింగ్ లో పలువురు కీలక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హాజరు కాకపోవడం చూస్తే వాళ్లకు ఈ ఒప్పందాలు ఎంత మాత్రం రుచించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముందుగా వినతి పత్రం ఇచ్చి ఆమేరకు అందులోనే బంద్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించే ఆలోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే కనక జరిగితే జూన్ రిలీజులు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ముందుగా కమల్ హాసన్ దగ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. తెలుగులో డబ్బింగ్ కాబట్టి ఇక్కడ వాయిదా వేసినా తమిళ వెర్షన్ యధావిధిగా రిలీజవుతుంది. లేదూ అంటే అసోసియేషన్ పరిధిలోకి రాని మల్టీప్లెక్సుల్లో మాత్రమే షోలు వేయాల్సి ఉంటుంది. అసలు గండం ఇది కాదు. జూన్ 12 హరిహర వీరమల్లు వస్తున్నాడు. దీని మీద పెద్దఎత్తున పెట్టుబడులు, అడ్వాన్సులు ముడిపడి ఉన్నాయి.
సో ఈ నిర్ణయం అమలులోకి వస్తే తీవ్ర చిక్కులు తప్పవు. ఇంకా పన్నెండు రోజుల సమయం ఉంది కాబట్టి సయోధ్యకు టాప్ ప్రొడ్యూసర్లు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. సింగిల్ స్క్రీన్లలో కూడా పర్సెంటేజ్ విధానం తీసుకొస్తే నిర్మాతకొచ్చే రెవిన్యూ తగ్గిపోతుంది. అందుకే కొందరు వ్యతిరేకిస్తున్నారనే భావన డిస్ట్రిబ్యూటర్లలో ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఇండస్ట్రీ పెద్దల నుంచి స్పందన తెలియాల్సి ఉంది. ఇష్యూ మరీ ముదరకుండా వీలైనంత త్వరగా పరిష్కారం చూపిస్తే మంచిది. ఈ రోజు మీటింగ్ లో దిల్ రాజు, సురేష్ బాబుతో సహా 60కి పైగా పంపిణీదారులు పాల్గొన్నట్టు సమాచారం.
This post was last modified on May 18, 2025 5:48 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…