కొవిడ్ మొదలైన దగ్గర్నుంచి వేసవిలో సినిమాల సందడి అనుకున్నంతగా ఉండట్లేదు. కరోనా ప్రభావంతో రెండు సీజన్లు వేస్టయిపోగా.. ఆ తర్వాతి ఏడాది ‘ఆర్ఆర్ఆర్’తో సందడి నెలకొంది. కానీ గత రెండేళ్లూ భారీ చిత్రాల సందడి కనిపించలేదు. ఈ ఏడాది అయితే పరిస్థితి మరీ దారుణం. ‘హిట్-3’ అనే ఈ సీజన్‌కు అతి పెద్ద సినిమా అయింది. ఆ స్థాయి సినిమాలు కూడా ఇంకేవీ రిలీజ్ కాలేదు. దీంతో సమ్మర్ లాంటి క్రేజీ సీజన్లో బాక్సాఫీస్ కళ తప్పింది. ఐతే వేసవిలో హీట్ తగ్గినా.. ఆ సీజన్ అయ్యాక మాత్రం బాక్సాఫీస్ బాగా వేడెక్కబోతోంది.
జూన్ మొదటి వారం నుంచి నెల రోజుల పాటు ప్రతి వారం ఓ క్రేజీ మూవీ రిలీజ్ కానుండడం ఇటు సినీ ప్రియులకు.. అటు ఇండస్ట్రీ జనాలకు ఉత్సాహాన్నిచ్చే విషయమే. జూన్ మొదటి వారంలో కమల్ హాసన్-మణిరత్నం సినిమా ‘థగ్ లైఫ్’ రాబోతోంది. తమిళంలో భారీ అంచనాాలున్న ఈ సినిమాకు తెలుగులోనూ క్రేజ్ ఉంది. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరి హర వీరమల్లు’ పలుమార్లు వాయిదా పడి.. చివరికి జూన్ 12కు ఫిక్స్ అయింది.
ఈసారి రిలీజ్ విషయంలో సందేహాలేమీ లేవు. పక్కాగా ఆ రోజు వచ్చేస్తుంది. మూడో వారానికి అక్కినేని నాగార్జున-ధనుష్‌ల ‘కుబేర’ షెడ్యూల్ అయింది. ఆ సినిమా కూడా తెలుగు-తమిళ భాషల్లో మంచి అంచనాల మధ్య విడుదల కాబోతోంది. తర్వాతి వారం మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ విడుదల కానుంది. ప్రభాస్ కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమాకూ మంచి హైప్ ఉంది. ఇక జులై 4న రానున్న విజయ్ దేవరకొండ మూవీ ‘కింగ్‌డమ్’ మీదా భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలతో నెల రోజుల పాటు బాక్సాఫీస్ కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on May 18, 2025 7:33 am
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…