రెగ్యులర్ మాస్ కు దూరంగా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా విభిన్నమైన ప్రయత్నాలు చేస్తాడనే పేరున్న అడివి శేష్ క్షణం నుంచి వెనక్కు చూడాల్సిన అవసరం లేకపోయింది. గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 ది సెకండ్ కేస్ ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడమే కాక శేష్ రేంజ్ ని పెంచాయి. కానీ గ్యాప్ రావడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. దాన్ని తగ్గిస్తానని ఇటీవలే హిట్ 3 సక్సెస్ మీట్ లో చెప్పిన అడివి శేష్ దానికి తగ్గ ప్లానింగ్ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే షూటింగ్ మొదలైన క్రమంలో కాకుండా ముందు పూర్తయిన పద్ధతిలో డెకాయిట్ ఫస్ట్ రిలీజ్ కానుందని తెలిసింది.
షానియేల్ డియో దర్శకత్వం వహించిన డెకాయిట్ లో ముందు శృతి హాసస్ ని హీరోయిన్ గా తీసుకుని కొంత భాగం షూట్ అయ్యాక తన స్థానంలో మృణాల్ ఠాకూర్ ని తీసుకుని మళ్ళీ రీ షూట్ చేశారు. హీరోయిన్ మీద హీరో రివెంజ్ తీర్చుకునే వెరైటీ పాయింట్ తో డెకాయిట్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అయితే గూఢచారి 2 ఎందుకు లేట్ అవుతుందనే కారణాలు సహేతుకంగానే కనిపిస్తున్నాయి. బడ్జెట్ పరంగా జి2 చాలా కాస్ట్లీగా రూపొందుతోంది. ప్యాన్ ఇండియా స్కేల్ కావడంతో ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు. సో హడావిడి పడకుండా 2026 వేసవి లేదా ఆపై దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తారని తెలిసింది.
సో డెకాయిట్ ని 2025లోనే చూడొచ్చు. త్వరలోనే అఫీషియల్ నోట్ రానుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలంటే అభిమానులకు హ్యాపీనేగా. గూఢచారి 2కి మొదటి భాగం డైరెక్ట్ చేసిన శశికిరణ్ తిక్కా కాకుండా వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు రచన పరంగా అడివి శేష్ కాంట్రిబ్యూషన్ ఉంటోంది. గూఢచారి 2కి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వాములు కాగా డెకాయిట్ కి ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ పెట్టుబడి పెడుతున్నాయి. అందుకే ఖర్చు విషయం రాజీ లేదు కాబట్టే అడివి శేష్ వీటి మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.