ఎంత పెద్ద స్టార్ అయినా రాజమౌళి సినిమాలో నటించేటప్పుడు వేరే ఆలోచనలు చేయడం, ఇతర స్క్రిప్ట్ లు వినడం కానీ చేయరు. ఇదేమి జక్కన్న కండీషన్ కాకపోయినా ప్రాజెక్ట్ లో జరిగే ఆలస్యంతో పాటు ఇతర విషయాల పట్ల డైవర్షన్ రాకూడదనే ఉద్దేశంతో హీరోలు వేరే నెరేషన్లకు దూరంగా ఉంటారు. చాలా అరుదుగా మినహాయింపు లభిస్తుంది. ఆర్ఆర్ఆర్ టైంలో రామ్ చరణ్ కు ఆచార్యలో నటించే ఛాన్స్ దొరకడం అలాంటిదే. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఇటీవలే సమ్మర్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఎండలు మరీ ఎక్కువగా ఉండటంతో ఓ నెల ప్యాకప్ చెప్పారు.
ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబి 30కి రంగం సిద్ధమవుతోందనే పుకారు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు మహేష్ కు ఒక లైన్ వినిపించాడని, దాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడని వాటి సారాంశం. అయితే ఇది నిజం కాదు. ఎందుకంటే పెద్ది తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉంటున్న బుచ్చిబాబు దగ్గర వేరే కథలున్నాయి కానీ ఇప్పటికిప్పుడు వాటి మీద పని చేసే ఉద్దేశంలో తను ఎంత మాత్రం లేడు. పైగా పెద్ది తనకు లైఫ్ టైం ఆపర్చునిటీ. ప్రతి విషయంలో వెయ్యి రెట్లు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఇంకో హీరో దగ్గరికి వెళ్లేంత తీరిక ఎంత మాత్రం లేదు.
ఇక మహేష్ బాబు సంగతి సరేసరి. ఎస్ఎస్ఎంబి 29 ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అసలు ఒక భాగమా లేక సీక్వెల్ ఉంటుందా అనే క్లారిటీ లేదు. ఎంతలేదన్నా దీనికి రెండు సంవత్సరాల కనీస సమయం పడుతుంది. అప్పటిదాకా మహేష్ ఎవరిని కలిసే ఆసక్తి కూడా చూపించకపోవచ్చు. అలాంటప్పుడు బుచ్చిబాబు, మహేష్ కలుసుకోవడం, కథ గురించి డిస్కస్ చేసుకోవడం జరగని పని. కార్యరూపం దాలిస్తే సంతోషమే కానీ ఇంత టైట్ షెడ్యూల్స్ లో వీళ్లిద్దరూ తలమునకలై ఉంటే ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో లోగుట్టు పెరుమాళ్ళకెరుక. ప్రస్తుతానికి ఫ్యాన్స్ దీన్ని లైట్ తీసుకోవడం బెటర్.