ఎప్పుడు మొదలవుతుందో స్పష్టమైన సమాచారం లేకపోయినా స్పిరిట్ మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ వంగా టేకప్ చేస్తున్న మూవీ కావడంతో బిజినెస్ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. రిలీజ్ ఎప్పుడు ఉన్నా అడ్వాన్స్ ఇప్పుడే తీసుకోమని కొందరు బయ్యర్లు ఒత్తిడి చేస్తున్న వైనం గురించి బాలీవుడ్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లొకేషన్ల వేటలో దేశదేశాలు తిరుగుతున్న స్పిరిట్ ఇంకో వైపు క్యాస్టింగ్ పనులు కూడా చూసుకుంటోంది. హీరోయిన్ గురించి కీలక లీక్ ప్రస్తుత హాట్ టాపిక్.
విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకునే దాదాపు లాకైనట్టు తెలిసింది. ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ అనుకున్నారు కానీ తర్వాతెందుకో నిర్ణయం మార్చుకున్నారట. నిజానికి కల్కి నిర్మాణంలో ఉండగానే సందీప్ దీపికను కలిసి స్పిరిట్ లైన్ చెప్పాడట. కానీ అప్పుడు గర్భవతిగా ఉండటంతో డేట్లు ఇవ్వలేని పరిస్థితి రావొచ్చని భావించి ఇష్టం లేకపోయినా దీపికా నో చెప్పిందట. అయితే రకరకాల కారణాల వల్ల స్పిరిట్ ఆలస్యం కావడంతో ఇప్పుడెలాంటి సమస్య లేదు. షారుఖ్ ఖాన్ కింగ్ తో పాటు స్పిరిట్ కు సమాంతరంగా కాల్ షీట్లు సర్దుబాటు చేసేలా ప్రాధమికంగా ఓకే అయ్యిందని వినికిడి.
సో కల్కి 2 కన్నా ముందే ప్రభాస్, దీపికా జంటగా కనిపించే అవకాశం స్పిరిట్ లో రావొచ్చు. అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ కథను తెరకెక్కిస్తున్న సందీప్ వంగా ఇందులో హీరోయిన్ పాత్రను ఎలా డిజైన్ చేసి ఉంటాడనే ఆసక్తి కలగడం సహజం. షాలిని పాండే, రష్మిక మందన్నలను చూపించిన విధానమే దానికి నిదర్శనం. ఒకవేళ దీపికా పదుకునేది కన్ఫర్మ్ అయిన పక్షంలో వేసవిలో స్పిరిట్ షూటింగ్ ప్రారంభానికి దగ్గరలో ప్రకటన ఇవ్వొచ్చు. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి రాగానే ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ డేట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవి కాకుండా ప్రశాంత్ వర్మ మూవీ కూడా ఇక్కడ చెప్పిన లిస్టులో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates