Movie News

రేపే విడుదల – నాని పట్టుదల

ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయంలోనే హిట్ 3 ది థర్డ్ కేస్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉండగా ఆంధ్రప్రదేశ్ జిఓ ఆలస్యం కారణంగా ఆన్ లైన్ అమ్మకాలు ఇంకా ప్రారంభం కాకపోవడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టింది. రైల్వే కోడూరు లాంటి చిన్న సెంటర్స్ లో మిడ్ నైట్ షోలు పెట్టడం గమనార్షం. ఏ నిమిషమైనా జిఓ వచ్చేసి సేల్స్ మొదలైపోతాయి కానీ ఇదంతా ఒక రెండు రోజులు ముందుగా జరిగి ఉంటే బాగుండేదని అభిమానులు ఫీలవుతున్నారు. ప్రీ రిలీజ్ బజ్ ఆశించిన దానికన్నా ఎక్కువే కనిపిస్తోంది. ఇక పట్టుదల మ్యాటరేంటో చూద్దాం.

దసరా బ్లాక్ బస్టర్ ఫలితం చూశాక నాని ఎక్కువగా మాస్ ని టార్గెట్ చేసుకుంటున్న వైనం కథల ఎంపికలో కనిపిస్తోంది. మధ్యలో హాయ్ నాన్న చేసినప్పటికీ సరిపోదా శనివారంతో తన ప్రాధాన్యం ఏ జానర్లకు ఎక్కువ ఉందో స్పష్టం చేశాడు. టాప్ లీగ్ లోకి దూసుకుపోవడానికి ఎలాంటి సబ్జెక్టులు కావాలో వాటిని ఆచితూచి ఎంచుకుంటున్నాడు. హిట్ 3లో వయొలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందుకే. ప్యారడైజ్ లో హీరో మీద బోల్డ్ క్యారెక్టరైజేషన్ పెట్టినా ఎస్ చెప్పింది కూడా అందుకే. సో హిట్ 3 కనక బ్లాక్ బస్టర్ అయితే తన నమ్మకం మరింత బలపడి మార్కెట్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.

తెలుగులోనే కాదు పోటీ ఎంత ఉన్నా సరే హిట్ 3 ఇతర భాషల్లోనూ సత్తా చూపుతుందని నమ్ముతున్నాడు. తమిళంలో రెట్రో – టూరిస్ట్ ఫామిలీ, హిందీలో రైడ్ 2, హాలీవుడ్ మూవీ థండర్ బోల్ట్స్ కాంపిటీషన్ ఇస్తున్నా సరే కంటెంట్ అందరినీ మెప్పిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. హింస ఎక్కువగా ఉంటుంది కుటుంబ ప్రేక్షకులను దూరంగా ఉండమని ఒక స్టార్ హీరో స్టేట్ మెంట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. దీన్ని బట్టే నాని లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత బడ్జెట్, పట్టుదలను పెట్టుబడిగా పెట్టిన నానికి ఎలాంటి ఫలితం దక్కబోతోందో రేపీ సమయానికి తెలిసిపోతుంది. చూద్దాం.

This post was last modified on April 30, 2025 2:19 pm

Share

Recent Posts

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

14 minutes ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

2 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

7 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

8 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

9 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

9 hours ago