ఈ మధ్య కాలంలో నిర్మాతలు తమ సినిమా హిట్టని చెప్పుకోవడానికి ఎక్కువగా వాడుతున్న పదం బ్రేక్ ఈవెన్. అంటే పెట్టుబడి వంద రూపాయలు పెడితే ఆ వందా వెనక్కు వస్తే దాన్ని బ్రేకీవెన్ అంటారు. ఆపై వచ్చేది ఎంతైనా సరే లాభం కిందకు వస్తుంది. ఇదంతా థియేటర్ బిజినెస్ లెక్కల్లోనే సుమా. కానీ ప్రొడ్యూసర్లు కొందరు కొత్త భాష్యం చెబుతూ ఫ్లాప్ ముద్రని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఒక హారర్ కం డివోషనల్ సినిమాకు రిలీజ్ కు ముందే సేఫ్ అయ్యామని ప్రెస్ మీట్ లో ఘనంగా చెప్పుకున్నారు. కాబట్టి తమకు ఆ పదం వర్తించదని, విజయం సాధించామని స్వీట్లు పంచుకున్నారు.
తీరా చూస్తే రెండో రోజే దానికి వసూళ్లు లేవు. జనాలకు నచ్చలేదని అర్థమైపోయింది. అన్ని ఏరియాలు డెఫిషిట్లు చూపించాయి. వీకెండ్ తిరిగే లోపే తీసేసే పరిస్థితి నెలకొంది. నిర్మాత ఓటిటి, డిజిటల్, డబ్బింగ్ హక్కులతో గట్టెక్కాడు సరే, మరి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పరిస్థితి ఏంటి. అద్దెలు కట్టి, ఖర్చులు భరించి, క్యూబ్ వ్యయం మోసి, ఇంతా చేసి వాళ్లకు వచ్చిన కలెక్షన్ షోకు పది వేల లోపే వచ్చాయి. అంటే లక్షలు పెడితే వేలు వచ్చాయి. అదే తరహాలో ఇంకో మీడియం రేంజ్ స్టార్ హీరో సినిమా పెద్ద బడ్జెట్ తో వచ్చింది. హీరో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ బయ్యర్లు ఫోన్లు చేసి మంగళ బుధవారాల్లో మొత్తం డబ్బు వెనక్కు వస్తుందని అన్నారని చెప్పాడు.
కట్ చేస్తే ఇది కూడా వీకెండ్ కాగానే చేతులు ఎత్తేసింది. థియేటర్ బిజినెస్ జరిగిన దాంట్లో సగం కూడా రాలేదు. సీనియర్ నటి పాత్ర, పెద్ద బడ్జెట్, కమర్షియల్ కాన్వాస్, పెద్ద టీమ్ ఇవేవి పబ్లిక్ ని టికెట్లు కొనేలా చేయలేకపోయాయి. ఇక్కడ చెప్పిన రెండు ఉదాహరణలు బ్రేక్ ఈవెన్ కు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. మరి స్టేజి మీద చెబుతున్న మాటలు నీటి మూటలని తేలుతున్నాయిగా. నిర్మాతే కాదు దాని మీద డబ్బు పెట్టిన ప్రతి ఒక్కరు ఒక్క పైసా అయినా సరే లాభపడితేనే హిట్టు కింద జమకడతారు తప్పించి కేవలం ప్రొడ్యూసర్ బయటపడితే కాదు. అందుకే కాబోలు రెండు టీములు ఆ తర్వాత హఠాత్తుగా సైలెంటయ్యారు.
This post was last modified on April 28, 2025 12:23 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…