దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ దుర్ఘటన పట్ల చిన్నా పెద్దా ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ నుంచి ప్రతిఒక్కరు ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. అయితే ఉగ్రవాద చీడ ఇప్పటిది కాదు. ఎన్నో దారుణాలు, చితికిపోయిన ఎన్నో ప్రాణాలు మూగ సాక్ష్యాలుగా నిలుస్తూ వచ్చాయి. సినిమాలవైపు టెర్రరిజం పట్ల వ్యతిరేక స్వరం ఎక్కువగా వినిపించింది మన దక్షిణాది చిత్రాలే. అందులోనూ తెలుగులోనే ఎక్కువ. మచ్చుకు కొన్ని చూద్దాం. కృష్ణవంశీ ‘ఖడ్గం’లో టెర్రరిస్టు ఘాతుకాలని చూపించిన వైనం, దేశభక్తిని రగిల్చిన విధానం దాన్నో క్లాసిక్ గా మార్చేసింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ పాత్రలు అలా ముద్రించుకుపోయాయి.
నాగార్జున ‘ఆజాద్’లో మతం ముసుగులో మారణహోమం చేసే ముష్కరులు మన మధ్యే ఎలా ఉంటారో రఘువరన్ ద్వారా ఆవిష్కరించిన విధానం బాగా పేలింది. శ్రీకాంత్ ‘టెర్రర్’ కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎమోషన్ ని పాట్రియాటిజంతో ముడిపెట్టిన శర్వానంద్ ‘అమ్మ చెప్పింది’ మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించి సగటు మాములు మనుషుల్లోనూ దేశం కోసం ప్రాణాలొదిలే వాళ్లుంటారని చూపించింది. అడవి శేష్ ‘మేజర్’ ముంబై దాడుల్లో ప్రమాదరకమైన పరిస్థితుల్లో మన వీరులు ఎదురుకుని విజయం సాధించిన తీరుని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించింది.
అంతకు ముందు వచ్చిన ‘గూఢచారి’ తెరవెనుక స్పై ఏజెంట్లు చేసే సాహసాలను అద్భుతంగా పరిచయం చేసింది. నాగచైతన్య ‘యుద్ధం శరణం’ ఆశించిన విజయం అందుకోలేదు కానీ టెర్రర్టిస్టుల అంశాన్ని స్పృశించే ప్రయత్నం చేసింది. దర్శకుడు క్రిష్ తీసిన ‘వేదం’లో అల్లు అర్జున్, మంచు మనోజ్ క్యారెక్టర్ల ద్వారా తీవ్రవాదంపై గట్టి గళం వినిపించడం మర్చిపోలేం. డబ్బింగ్ అయినా కమల్ హాసన్ ‘విశ్వరూపం’, విజయ్ ‘తుపాకీ’లను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవచ్చు. మణిరత్నం ‘రోజా’ ఆవేశంతో పాటు ఆలోచన రగిలించిన మాస్టర్ పీస్. జెండాకు అంటుకున్న నిప్పుని ఆరవింద్ స్వామి ఆర్పే సన్నివేశం ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు, స్ఫూర్తినిచ్చే సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on April 23, 2025 4:13 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…