ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. లాస్ట్ వీక్ భారీ అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోవడంతో ఇప్పుడు అందరి కళ్ళు ఏప్రిల్ 25 మీదున్నాయి. మే ఒకటి నాని హిట్ 3 ది థర్డ్ కేస్ వస్తున్న నేపథ్యంలో ఆలోగా థియేటర్ ఫీడింగ్ కి ఇవి ఎంతమేరకు ఉపయోగపడతాయోనని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘సారంగపాణి జాతకం’ మీద కామెడీ లవర్స్ కు మంచి అంచనాలున్నాయి. రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్విస్తామని టీమ్ ధీమాగా చెబుతోంది. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది.
త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం ‘చౌర్య పాఠం’కు బజ్ పెంచే ప్రయత్నాలు జోరుగా ఉన్నాయి. ట్రైలర్ చూశాక ఏదో వెరైటీ ఫన్ రైడ్ అనిపిస్తోంది. అదే సినిమా మొత్తం ఉంటే టాక్ తో జనాన్ని రప్పించొచ్చు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘అలపుజా జింఖానా’ తెలుగు డబ్బింగ్ ప్రేమలు తరహాలో మేజిక్ చేస్తుందనే నమ్మకం సదరు బృందంలో కనిపిస్తోంది. ఇవి కాకుండా ఎర్రచీర, శివ శంభో, సూర్యాపేట జంక్షన్, సర్వం సిద్ధం, హలో బేబీ, 6 జర్నీ, మన ఇద్దరి ప్రేమకథలు బరిలో ఉన్నాయి. వీటిలో ఒకటో రెండో చివరి నిమిషంలో వాయిదా మంత్రం పఠిస్తే చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే లిస్టులో తోడయ్యాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బాషా’ని రీ రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’ కూడా ప్లాన్ చేశారు కానీ బుకింగ్స్ మొదలుపెట్టాక క్యాన్సిల్ చేయడం గమనార్షం. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’కి నిర్మాతలు భారీ స్పందన ఆశిస్తున్నారు. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ ‘గ్రౌండ్ జీరో’ మీద ట్రైలర్ వచ్చాక బజ్ పెరిగింది. సో ఏప్రిల్ చివరి వారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ ఏవి టాక్ తో జనాన్ని థియేటర్లకు రప్పిస్తాయో చూడాలి. అసలే ఎండలు దానికి తోడు ఐపీఎల్ మ్యాచులు. తిరిగి వారం తర్వాత హిట్ 3 మీద నెలకొన్న భారీ అంచనాలు. వీటిని తట్టుకుని పైన చెప్పిన సినిమాల్లో ఏవి విజేతలుగా నిలుస్తాయో చూడాలి.
This post was last modified on April 22, 2025 5:18 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…