Movie News

సినిమా ఆగిపోలేదని ఇలా క్లారిటీ ఇచ్చారు

స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా.. అప్ క‌మింగ్ హీరో స‌త్య‌దేవ్ జంటగా ఇటీవ‌లే గుర్తుందా శీతాకాలం పేరుతో ఓ సినిమా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. కన్నడలో విజ‌య‌వంత‌మైన ‘లవ్ మాక్‌టైల్’కు ఇది రీమేక్. ఈ సినిమా గురించి ఘ‌నంగా ప్ర‌క‌ట‌న చేశారు. ప్రారంభోత్స‌వం కూడా జ‌రిపారు. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డ‌మే త‌రువాయి అనుకున్న ద‌శ‌లో త‌మ‌న్నా క‌రోనా బారిన ప‌డింది. వైర‌స్ నుంచి కోలుకున్నాక ఆమె ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లోనే పాల్గొన‌డానికి సిద్ధ‌మైన‌ట్లు క‌నిపించింది.

కానీ ఇంత‌లో ఈ సినిమా ఆగిపోయిందంటూ కొన్ని రోజుల కింద‌ట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. బ‌డ్జెట్ స‌మ‌స్య‌ల వ‌ల్ల గుర్తుందా శీతాకాలం సినిమాను ఆపేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించిన‌ట్లుగా చెప్పుకున్నారు.దీని మీద చిత్ర బృందం నుంచి అధికారికంగా ఖండ‌న ఏదీ లేక‌పోవ‌డంతో ఈ వార్త నిజ‌మేనేమో అన్న సందేహాలు క‌లిగాయి.

ఐతే ఎట్ట‌కేల‌కు చిత్ర బృందం ఈ వార్త‌ల‌పై స్పందించింది. సినిమా ఆగిపోయింద‌న్న ప్ర‌చారం గురించి ఏమీ మాట్లాడుకుండా.. ఒక అప్పీల్‌తో జ‌నాల ముందుకొచ్చింది. ఈ సినిమాలో స‌త్య‌దేవ్ చిన్న‌ప్ప‌టి పాత్ర చేయ‌డానికి 12-15 ఏళ్ల వ‌య‌సున్న కుర్రాడు కావాల‌న్న‌దే ఆ అప్పీల్‌. త‌ద్వారా ఈ సినిమా ఉంద‌ని, ముందు అనుకున్న కాస్ట్ అండ్ క్రూలో కూడా ఏ మార్పూ లేద‌ని చెప్ప‌క‌నే చెప్పింది.

త‌మ‌న్నా త‌ప్పుకోవ‌డం వ‌ల్లే సినిమా ఆగింద‌ని అన్నారు కానీ.. ఈ అప్పీల్ గురించి పోస్ట్ చేసిన పీఆర్వోలంద‌రూ స‌త్య‌దేవ్ స‌ర‌స‌న త‌మ‌న్నానే ఈ సినిమాలో న‌టించ‌బోతోంద‌ని పేర్కొన్నారు. మ‌రి త‌మ‌న్నాతో ఏ స‌మ‌స్యా లేదా లేక ఏదైనా ఉంటే ప‌రిష్క‌రించుకున్నారా అన్న‌ది తెలియ‌దు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స‌త్య‌దేవ్‌కు ఇలా సినిమా ఆగిపోయిందంటే నెగెటివ్ అవుతుంది. కాబ‌ట్టి అత‌డికి ఇబ్బంది లేద‌న్న‌మాటే.

This post was last modified on November 2, 2020 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

53 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

1 hour ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

1 hour ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

3 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

3 hours ago