Movie News

నానికి మరో జాక్ పాట్

కొన్నేళ్లుగా టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ఊపు మామూలుగా లేదు. ఇటు హీరోగా వరుస హిట్లు కొడుతున్నాడు. అటు నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు. నాని ప్రొడక్షన్లో వచ్చిన హిట్, హిట్-2, కోర్ట్.. ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. నానికి పేరుతో పాటు డబ్బులూ తెచ్చిపెట్టాయి. ఇక హీరోగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు నాని.

గత నెలలో వచ్చిన నాని ప్రొడక్షన్ మూవీ ‘కోర్ట్’ అయితే పెట్టుబడి మీద రెండు రెట్ల లాభం అందించింది. ఇప్పుడు నానికి ఇంకో జాక్ పాట్ తగిలినట్లు సమాచారం. తనే హీరోగా నటిస్తూ సొంత ప్రొడక్షన్లో నాని ‘హిట్-3’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. హిట్ సిరీస్‌లో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

‘హిట్-3’ మొదలైనప్పుడే బంపర్ క్రేజ్ వచ్చింది. దీని టీజర్ వచ్చాక హైప్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ఇంకో నాలుగు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపే ఈ సినిమాకు బిజినెస్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్‌ను నెల ముందే నెట్‌ఫ్లిక్స్ వాళ్లకు అమ్మేశాడు నాని. ఏకంగా రూ.54 కోట్ల రేటు పలికింది. ఇక సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతోందట. ఇంకా ఆడియో, శాటిలైట్, హిందీ డబ్బింగ్.. లాంటి నాన్ థియేట్రికల్ రైట్స్ ఉండనే ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా మీద నాని రూ.35-40 కోట్ల లాభం అందుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రూ.60 కోట్ల దాకా ఖర్చయినట్లు సమాచారం.

నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే బడ్జెట్ మీద కొంత లాభం రాగా.. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభమే. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు నిర్మించే పెద్ద సినిమాలకు కూడా ఈ స్థాయిలో లాభాలు రావడం అరుదు. మొత్తానికి నాని టైం ప్రస్తుతం మామూలుగా లేదని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

This post was last modified on April 7, 2025 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘బీఆర్ఎస్ స‌భ’ నిర్వ‌హించ‌రాద‌నే ఉద్దేశం క‌నిపిస్తోంది: హైకోర్టు

"మీరు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి.. మీరు అడుగుతున్న గ‌డువును బ‌ట్టి.. బీఆర్ఎస్ స‌భ‌ను నిర్వ‌హించరాద‌న్న ఉద్దేశం క‌నిపిస్తోంద‌ని మేం భావించేలా…

49 minutes ago

త్రిషకు కోపం తెప్పించిన సోషల్ మీడియా

రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయినా ఇంకా హీరోయిన్ గా చెలామణి అవుతున్న అతికొద్ది మందిలో త్రిష స్థానం మొదటిదని చెప్పాలి.…

1 hour ago

భార‌తికి భ‌ద్ర‌త‌.. హైకోర్టుకు వైసీపీ?

తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన…

2 hours ago

బాబు మాటనే పెడచెవిన పెడుతున్నారా..?

సుపరిపాలనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది అందె వేసిన చెయ్యి. ప్రజలకు మెరుగైన పాలన అందించే విషయంలో నిత్యం…

3 hours ago

వారం గ్యాప్ – మెగాస్టార్ VS మాస్ రాజా ?

పెద్ద సినిమాలకు విడుదల తేదీ దోబూచులాటలు తప్పడం లేదు. ముందు ఒక డేట్ అనుకోవడం, తర్వాత దానికి కట్టుబడలేక మార్చుకోవడం,…

3 hours ago

వదినమ్మకు మద్దతు.. అన్నయ్యకు చీవాట్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు చేబ్రోలు…

3 hours ago