కాదేది కవితకు అనర్హం అన్నారో మహాకవి. సోషల్ మీడియా ప్రపంచంలో కవిత తీసేసి దాని స్థానంలో వైరల్ టాపిక్ అని పెట్టాలి. ఆ మధ్య కుమారి అంటి అనే ఒకావిడ నాన్ వెజ్ మీల్స్ కోసం ముగ్గురికి వెయ్యి రూపాయలు బిల్లయ్యిందని చెప్పిన వీడియో ఎంత దూరం వెళ్లిందో చూశాం. వేలాది జనాలు, వందలాది మీడియా జర్నలిస్టులు ఆమె దగ్గరికెళ్లి భోజనం చేసే దాకా పబ్లిసిటీ జరిగింది. అక్కడితో ఆగకుండా ఏకంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి దాకా కుమారి పేరు పాకిపోయింది. తర్వాత ఈ టాపిక్ చల్లబడటం వేరే విషయం. తాజాగా ఎక్స్ లో ఎక్కడ చూసినా అలేఖ్య పచ్చళ్ళ గోల ఎక్కువగా వినిపిస్తూ పెద్ద డ్రామా జరుగుతోంది.
నిత్యం ఎక్స్ లో ఉండేవాళ్ళకు అవగాహన ఉంటుంది కానీ లేనివాళ్లుకు క్లుప్తంగా స్టోరీ. ఆన్ లైన్ లో పచ్చళ్ళు అమ్మే అలేఖ్య అనే అమ్మాయి వాటి ధర వేలల్లో పెట్టింది. కేవలం అరకేజీ నాన్ వెజ్ పచ్చడికి పదిహేను వందలకు పైగా ఉండటం చూసిన ఒక కస్టమర్ ఇంత రేట్ ఏంటని ఆమెకు మెసేజ్ చేశాడు. దానికామె మాములుగా సమాధానం చెబితే అయిపోయేది. కానీ బూతులు జొప్పిస్తూ ఆఫ్ట్రాల్ పచ్చడి కొనలేనివాడిని నీకెందుకు ఇదంతా, ముందు డబ్బు సంపాదించే కెరీర్ చూసుకోమంటూ ఘాటుగా వాయిస్ రూపంలో స్పందించడంతో ఒళ్ళు మండిన ఆ కస్టమర్ సంభాషణంతా ఆన్ లైన్లో పెట్టేశాడు. దీంతో రచ్చ ఎక్కడికో వెళ్ళిపోయింది.
తర్వాత దానికి అలేఖ్య స్పందించి పబ్లిక్ వీడియో విడుదల చేయడం, సారీ గట్రాలు చెప్పడం జరిగిపోయాయి కానీ రాబోయే కొత్త సినిమాలు ఈ ట్రెండింగ్ టాపిక్ ని వాడుకోవడం మొదలుపెట్టాయి. ప్రియదర్శి సారంగపాణి జాతకం కోసం హీరో హీరోయిన్ అచ్చంగా ఇదే పచ్చడి సీన్ ని ద్వందార్థాలు లేకుండా రీ క్రియేట్ చేశారు. నెక్స్ట్ లిస్టులో ఉన్న ఇతర రిలీజులు కూడా అదే పనిలో ఉన్నాయట. రేపో ఎల్లుండో ఇంకేదైనా వేరే సినిమాలో ఇదంతా ఒక ఎపిసోడ్ రూపంలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే జీవితంలో సెటిల్ కావడమంటే ఈ పికిల్స్ కొనే స్థాయిలో సంపాదించడమేనని కుర్రాళ్లు జోకులు వేసుకోవడం.
This post was last modified on April 5, 2025 6:27 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…