అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌లో పవన్ నటిస్తున్నాడనే వార్త బయటకు రాగానే అందులో యువ హీరో పాత్ర పోషించడానికి పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురు చూస్తోన్న హీరోలు చాలా మందే వున్నారు. అయితే ఈ పాత్ర తనకు ఇవ్వాల్సిందిగా నితిన్ బాగా మొహమాట పెడుతున్నాడట.
సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసినిలో అతను మూడు సినిమాలు చేయడంతో ఆ నిర్మాతలతో తనకు మంచి సంబంధాలున్నాయి. అందుకే ఈ చిత్రంలో తాను నటిస్తానని, పారితోషికం విషయంలో పట్టింపులు కూడా లేవని నితిన్ చెబుతున్నాడట. అలాగే పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నాడట. తనవంతు ప్రయత్నాలు తాను చేస్తూనే వున్నాడట. అయితే ఈ క్యారెక్టర్‌కి ఎవరు కరెక్ట్ అనేది పవన్ డిసైడ్ చేస్తాడట.
ముందుగా రానా దగ్గుబాటి అనుకున్నా కానీ పవన్ నుంచి అంగీకారం రాకపోవడం వలనే ఇంకా అతడి పేరుని అనౌన్స్ చేయలేదట. నితిన్, సాయి తేజ్ ఆ పాత్ర పోషించడానికి ఉత్సాహ పడినా కానీ కోషీ పాత్రకు కావాల్సిన ఆటిట్యూడ్, ఆరగెన్స్ వారు ఎంతవరకు ప్రదర్శిస్తారో, పవన్ కళ్యాణ్ ముందు వారు ఎంతవరకు సమవుజ్జీగా అనిపిస్తారో చెప్పడం కాస్త కష్టమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates