జులాయి లాంటి సినిమా కావాలంటున్నాడట

త్రివిక్రమ్‍ మలి చిత్రం రామ్‍తో వుంటుందని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇంకా దీనిపై అటు హారిక హాసిని వాళ్లు కానీ, ఇటు రామ్‍ కానీ స్పందించలేదు. కానీ ఎన్టీఆర్‍తో త్రివిక్రమ్‍ చేయాల్సిన సినిమా మరింత ఆలస్యమయ్యేట్టు అయితే రామ్‍తో సినిమా ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ అవకాశాన్ని ఎలాగయినా కైవసం చేసుకోవాలని రామ్‍ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.

త్రివిక్రమ్‍తో ఫ్యామిలీ సినిమా కాకుండా ‘జులాయి’ లాంటి యాక్షన్‍ బేస్డ్ ఫ్యామిలీ సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే తన కోరికను త్రివిక్రమ్‍కు రామ్‍ వెలిబుచ్చాడట. స్రవంతి రవికిషోర్‍తో వున్న అనుబంధం వల్ల త్రివిక్రమ్‍కు రామ్‍తో సినిమా చేసే ఆబ్లిగేషన్‍ అయితే ఎప్పట్నుంచో వుంది. అయితే వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేయడం వల్ల అది ఇంతవరకు కుదర్లేదు.

ఎన్టీఆర్‍ ‘ఆర్‍.ఆర్‍.ఆర్‍.’ నుంచి బయట పడడానికి టైమ్‍ పడుతుందంటే మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా మెటీరియలైజ్‍ అవుతుందని అంటున్నారు. నితిన్‍తో ‘అ.ఆ’ తీసినట్టుగా నలభై కోట్ల బడ్జెట్‍లో సినిమా తీయాలని త్రివిక్రమ్‍ ప్లాన్‍ చేస్తే రామ్‍ అదృష్టం పండినట్టే. ఇస్మార్ట్ శంకర్‍తో వచ్చిన మార్కెట్‍ కన్సాలిడేట్‍ అయిపోయి మిడ్‍ రేంజ్‍ హీరోల్లో తన రేంజ్‍ మరింత పెరిగిపోవడం గ్యారెంటీ.