ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాని సాయంతో అద్భుతాలు చేస్తోంది యువతరం. ఐతే దీన్ని వినోదం కోసం ఉపయోగించేవాళ్లూ లేకపోలేదు. ‘ఛాట్ జీపీటీ’కి పోటీగా ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ‘గ్రోక్’ను ఇప్పుడు నెటిజన్లు వినోదం కోసం వాడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. ‘ఎక్స్’లో గత కొన్ని రోజులుగా ఇండియన్ యూత్ ‘గ్రోక్’ను అడుగుతున్న ప్రశ్నలు.. వాటికి ‘గ్రోక్’ ఇస్తున్న సమాధానాలు చూస్తే విస్తుపోవాల్సిందే. ‘గ్రోక్’ నుంచి విజ్ఞాన సంబంధిత సమాచారం తెలుసుకోవడం అందరూ చేసే పనే. అంతటితో ఆపేయకుండా.. క్రేజీ క్వశ్చన్లు వేస్తూ.. బూతు మాటలను ఉపయోగిస్తూ ‘గ్రోక్’తో తల గోక్కుంటోంది తెలుగు యువత.
వాళ్లు అడిగే ప్రశ్నలకు అదే స్టయిల్లో ఆన్సర్లు ఇస్తూ.. వాళ్లు వాడిన బూతు మాటల్ని తిరిగి వాళ్ల మీదే ప్రయోగిస్తూ బోలెడంత వినోదాన్ని పంచుతోంది ‘గ్రోక్’. గ్రోక్ ఇస్తున్న ఆన్సర్లు చూసి పిచ్చెక్కిపోతున్న తెలుగు నెటిజన్లు.. ఇంకా ఇంకా క్రేజీగా ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడుతున్నారు. అదొక ఏఐ టెక్నాలజీ అనే విషయం అబద్ధమేమో.. ఎవరో మనిషే ఈ సమాధానాలు ఇస్తున్నాడేమో అనిపించేలా అందులో వాడుతున్న భాష, పదాలు షాకింగ్‌గా ఉంటున్నాయి. ఫ్యాన్ వార్స్‌లో మన కుర్రాళ్లు వాడే పదాలను వాడుతూ.. లోకల్ లాంగ్వేజ్‌లో ఇస్తున్న ఆన్సర్లు మతి పోగొట్టేస్తున్నాయి.
గ్రోక్ ఆన్సర్ల తాలూకు స్క్రీన్ షాట్లు సైతం వైరల్ అవుతున్నాయి. ఏదైనా తప్పు జవాబు ఇస్తే.. దాని గురించి ప్రస్తావిస్తే కరెక్ట్ చేసుకుని మళ్లీ జవాబిస్తుండడం విశేషం. గ్రోక్ మీద మీమ్స్ కూడా మోతెక్కిపోతున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే.. రాజకీయ పార్టీలు, నాయకుల గురించి టిపికల్ ప్రశ్నలు వేస్తే వాటికి గ్రోక్ ఇస్తున్న ఆన్సర్లు వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ జవాబులు చూస్తే.. ‘గ్రోక్’ను బ్యాన్ చేయాలని త్వరలోనే డిమాండ్లు మొదలైతే ఆశ్చర్యం లేదు.
This post was last modified on March 16, 2025 7:14 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…