నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా అ!, హిట్ 1, హిట్ 2 తీసినప్పటికీ ఇప్పుడు చూపిస్తున్న కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంది. రెండు రోజుల ముందే ప్రీమియర్లకు రెడవుతున్నాడు. మీడియాకు, ప్రేక్షకులకు విడివిడిగా రేపటి నుంచే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కోర్ట్ లో ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేదు. ప్రియదర్శి, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణీ లాంటి నోటెడ్ ఆర్టిస్టులున్నారు కానీ కంటెంట్ పరంగా ఇలాంటి కాన్సెప్ట్ లు కమర్షియల్ జనాలకు అంత సులభంగా రీచ్ కావు. కానీ నాని లెక్కలు వేరే ఉన్నాయి.
ఎంత కోర్ట్ రూమ్ డ్రామా అయినా సరే మాస్ ని మెప్పించే ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయని నమ్ముతున్నాడు. నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దని పిలుపు ఇవ్వడం ఆల్రెడీ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి మార్చి 14 మంచి స్లాట్. పరీక్షల సీజన్ అయినా సరే సాధారణ ప్రేక్షకులకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆప్షన్లు లేవు, ఛావా ఒకటే స్టడీగా ఉండగా రిటర్న్ అఫ్ ది డ్రాగన్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. మజాకా చాప్టర్ ముగిసిపోయింది. కిరణ్ అబ్బవరం దిల్ రుబా ఒకటే పోటీలో ఉంది. కాకపోతే రెండు సినిమాలు సంబంధం లేని జానర్లు కావడంతో కాంపిటీషన్ అనుకోవడానికి లేదు.
సో నాని నమ్మకానికి ప్రీమియర్లు పెద్ద పరీక్షే పెట్టబోతున్నాయి. టాక్ ఖచ్చితంగా పాజిటివ్ గా వస్తేనే తను అన్న మాటలకు వెయిట్ వస్తుంది. ట్రైలర్ చూశాక కనివిని చూడనిది అందులో కనిపించలేదు కానీ అసలైన కంటెంట్ కట్టిపడేసేలా ఉంటుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ప్రమోషన్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు. టీమ్ మొత్తం ఒక చోట చేర్చి తనే ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరికొన్ని చేయబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ లో ఉందని సమాచారం. ప్రీమియర్స్ నుంచి కనక కోర్ట్ బాగుందనే మాట వస్తే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు బోలెడు. చూడాలి ఎలా వాడుకుంటుందో.