పరిమిత బడ్జెట్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తీసి.. బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఆ చిత్రాన్ని నిలబెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో ఇండస్ట్రీ అంతటా అతడిపై ప్రశంసలు కురిశాయి. భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్ల కంటే.. పరిమిత వనరులతోనే ప్రేక్షకులు మెచ్చే వినోదాన్ని అందిస్తే అద్భుతమైన ఫలితం వస్తుందనడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ కావడానికంటే ముందు.. దీన్ని అనిల్ రావిపూడి అండ్ టీం ప్రమోట్ చేసిన విధానం కూడా ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడే ముందుండి ప్రమోషన్లను నడిపించాడు. ఫన్నీ ఐడియాలతో మేకింగ్ దశ నుంచే సినిమాను వార్తల్లో నిలబెట్టాడు అనిల్.
రిలీజ్ దగ్గర పడేసరికి ప్రమోషన్స్ పీక్స్‌కు వెళ్లాయి. సినిమా రిలీజైన నెల రోజులకు కూడా ప్రమోషన్లు కొనసాగడం విశేషం. ఈ విషయంలో అనిల్ ఒక రోల్ మోడల్‌గా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాధించిన విజయం చూశాక.. సినిమాను ప్రమోట్ చేస్తే ఇలా చేయాలి అనే ఫీలింగ్ మిగతా మేకర్స్‌లో కలిగింది. ఈ నెలాఖర్లో విడుదల కాబోతున్న ‘రాబిన్ హుడ్’ సినిమా విషయంలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మోడల్‌ను ఫాలో అయిపోతోంది టీం. ఈ సినిమాకు కూడా మేకింగ్ దశ నుంచి ఫన్నీగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇందులో దర్శకుడు వెంకీ లీడ్ తీసుకుంటున్నాడు.
పాట రిలీజ్ చేస్తున్నపుడు సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌తో కలిసి అతను చేసిన అల్లరి గురించి తెలిసిందే. ఆ తర్వాత సెట్స్ నుంచి ఇంకో రెండు వీడియోలు వదిలారు. తాజాగా నితిన్‌ను ప్రమోషన్ల కోసం లాక్ చేసేందుకు అతడి వెంట పడుతున్నట్లు వెంకీ ఒక వీడియో చేశాడు. అది ఫన్నీగా ఉంది. ‘రాబిన్ హుడ్’ టీం నుంచి ఈ వరుస వీడియోలు చూస్తుంటే అందరికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైంలో అనిల్ అండ్ టీం చేసిన సందడే గుర్తుకు వస్తోంది. ‘రాబిన్ హుడ్’ కూడా సక్సెస్ అయితే.. మున్ముందు మిగతా చిత్రాల మేకర్స్ కూడా ఇదే బాట పడతారేమో.
This post was last modified on March 7, 2025 4:08 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…