మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోతో సినిమా అంటే ఏ దర్శకుడైనా తొందరరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తాడు. కానీ అనిల్ రావిపూడి మాత్రం తన స్టయిల్ లో ఎలాంటి మార్పు ఉండదని ఎప్పటికప్పుడు తన చేతల ద్వారా చూపిస్తూనే ఉంటాడు. ఒక్కసారి టార్గెట్ లాక్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని అందుకునే తీరాలని కసితో పరుగులు పెడతాడు. సంక్రాంతికి వస్తున్నాం ఆ వేగం కారణంగానే పండగ సినిమాల్లో ముందు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకున్న మూవీగా రికార్డు సృష్టించింది. పోటీలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ ని తోసిరాజని విజేతగా నిలిచింది. ఇదే ఫార్ములాని మెగాస్టార్ కు వాడబోతున్నాడు అనిల్.
తనకు ఏకధాటిగా 90 రోజుల డేట్లు ఇమ్మని రావిపూడి చేసిన విన్నపానికి మెగాస్టార్ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందట. ప్రస్తుతం వైజాగ్ లో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మే నెలకల్లా ఫైనల్ వెర్షన్ రెడీ చేయాలి. ఆలోగా విశ్వంభర తాలూకు పనులన్నీ పూర్తయిపోయి ఉంటాయి కాబట్టి చిరంజీవి అందుబాటులోకి వచ్చేస్తారు. జూన్ లేదా జూలై నుంచి మొదలుపెట్టినా నవంబర్ కాంతా గుమ్మడికాయ కొట్టి, 2026 సంక్రాంతి బరిలో ఉండేలా ప్రతి షెడ్యూల్ ని పక్కా ప్లాన్ ప్రకారం సిద్ధం చేసుకున్నారట. భీమ్స్ తో సహా దాదాపు సంక్రాంతికి వస్తున్నాం టీమ్ నే రిపీట్ చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
అనిల్ రావిపూడి సిద్ధం చేసుకున్న కథ వినోద ప్రధానంగా ఉందే తప్ప విఎఫ్ఎక్స్, ఫారిన్ లొకేషన్స్ డిమాండ్ చేసేలా ఉండదట. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, చంటబ్బాయిని మిక్స్ చేసి వింటేజ్ చిరంజీవిని బయటికి తీసేలా అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే తీసేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. భీమ్స్ పాటల కంపోజింగ్ దాదాపు అయిపోవచ్చిందని సమాచారం. ఆడియో విన్న చిరు ఇంప్రెస్స్ అయ్యారట. కొరియోగ్రఫీ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. ఇంతకీ హీరోయిన్లు ఎవరనే లీక్ బయటికి రాలేదు. పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ డేట్లు దొరికాకే వాటిని కన్ఫర్మ్ చేస్తారట.
This post was last modified on March 7, 2025 11:02 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…