టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పేరు డేటింగ్ గాసిప్‌లలో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ టెలివిజన్ నటి, బిగ్‌బాస్-13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ ప్రేమలో ఉన్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ తరచుగా పార్టీలలో పాల్గొనడం, అలాగే కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే, తాజాగా ఈ పుకార్లపై మహిరా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
తన వ్యక్తిగత జీవితం గురించి గాసిప్‌లు రావడం సహజమేనని, కానీ అవన్నీ నిరాధారమైనవేనని మహిరా స్పష్టం చేసింది. తాను ఎవరితో క్లోజ్ గా ఉన్నా, ఎవరితోనైనా కనెక్ట్ చేస్తుంటారని, ఇలాంటి రూమర్లను పెద్దగా పట్టించుకునే ప్రసక్తే లేదని చెప్పింది. గతంలోనూ తాను పనిచేసిన సహనటులతో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది సెలబ్రిటీల జీవితంలో కొత్తేమీ కాదని తేల్చేసింది.
ఇక మహిరా కంటే ముందు ఆమె తల్లి సానియా శర్మ కూడా ఇదే విషయంపై స్పందించారు. ప్రస్తుతం ఫేమస్ కావడంతో, జనాలు ఎవరి పేరుతోనైనా లింక్ చేస్తారని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పింది. తన కూతురు ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం మహిరా శర్మ బాలీవుడ్, టెలివిజన్ రంగంలో బిజీగా ఉంది.
‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, ‘నాగిన్ 3’, ‘కుండలి భాగ్య’, ‘బేపనా ప్యార్’ వంటి సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆమెకి అసలైన పేరు రావడానికి కారణం ‘బిగ్‌బాస్ 13’. ఈ షో తర్వాత మహిరాకు ప్రేక్షకాదరణ పెరిగింది. మొత్తానికి, మహిరా-సిరాజ్ మధ్య ఉన్న అనుబంధంపై అవతలివాళ్లు ఎన్ని ఊహాగానాలు చేసినా, ఇద్దరూ మాత్రం స్పష్టత ఇచ్చారు.
This post was last modified on March 4, 2025 5:46 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…