జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ వార్ 2కి సంబంధించిన అతి కీలక ఘట్టానికి తెర తీశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదోనని అనుమాన పడిన అభిమానుల సందేహాలకు చెక్ పెడుతూ దర్శకుడు అయాన్ ముఖర్జీ తారక్, హృతిక్ మీద బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో ఒక పాటని షూట్ చేస్తున్నారు. ముంబై యష్ రాజ్ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో 500 డాన్సర్లతో పాటు కనివిని ఎరుగని రీతిలో చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇది ఏకధాటిగా ఆరు రోజుల పాటు జరగనుంది.
దీనికి సంబంధించిన రిహార్సల్స్ నెల రోజుల నుంచే జరుగుతున్నాయి. గ్రూప్ డాన్సర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తారక్, హృతిక్ ఇద్దరూ వర్క్ షాప్స్ లో పాల్గొన్నారు. పర్ఫెక్షన్ కోసం రాజీ లేకుండా కష్టపడుతున్నారు. ట్రిపులార్ ని మించిపోయేలా ఈ సాంగ్ వచ్చేలా టీమ్ మొత్తం ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆగస్ట్ 14 విడుదలను ప్లాన్ చేసుకున్న వార్ 2 నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం డేట్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక మీడియా, అభిమానులకు అఫీషియల్ గా చెప్పబోతున్నారు.
ఇది వచ్చేది లేనిది అనే దాని మీదే రజనీకాంత్ కూలి ఇండిపెండెన్స్ డేకి రావాలా వద్దా అనేది నిర్ణయించుకుంటుంది. దేవర తర్వాత ఏడాది గ్యాప్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారానికి భిన్నంగా టీమ్ అలాంటిదేమి లేదని కొట్టిపారేస్తోంది. పాజిటివ్ టచ్ ఉంటుందని, కాకపోతే తారక్, హృతిక్ పాత్రల మధ్య ఫేస్ ఆఫ్ ఊహించని స్థాయిలో డిజైన్ చేశారని అంటున్నారు. ప్రమోషన్లు ఇంకా మొదలుపెట్టలేదు. డేట్ ఖరారైతే ఏప్రిల్ నుంచి పబ్లిసిటీని భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ప్యాన్ ఇండియా బాషలన్నిటిలోనూ వార్ 2 వస్తుంది.
This post was last modified on March 4, 2025 10:30 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…