తీసింది మూడు సినిమాలే అయినా.. దేశవ్యాప్తంగా భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు టాలీవుడ్ యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఐతే అతడికి అభిమానులు మాత్రమే లేరు. తనను ఘాటుగా విమర్శించే, తీవ్రంగా ద్వేషించే వారి సంఖ్య కూడా పెద్దదే.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. ఈ మూడు చిత్రాల విషయంలోనూ అతను విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పురుషాధిక్యతను గ్లోరిఫై చేసేలా.. ఆడవాళ్లను కించపరిచేలా సన్నివేశాలు ఉంటాయని అతడిని విమర్శిస్తుంటారు క్రిటిక్స్. అనుపమ చోప్రా సహా చాలామంది కబీర్ సింగ్ రిలీజైనపుడు సందీప్‌పై మండిపడ్డ సంగతి తెలిసిందే. వివిధ సందర్భాల్లో సందీప్ వారికి దీటైన సమాధానమే ఇచ్చాడు.
అలాంటి సందీప్ భవిష్యత్తులో ఒక ఫుల్ లెంగ్త్ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నానని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంకా పెద్ద విశేషం ఏంటంట.. ఈ సినిమా మొత్తం లేడీ క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయని అతను చెప్పాడు.
కేవలం లేడీ ఆర్టిస్టులను మాత్రమే ముఖ్య పాత్రలకు తీసుకుని ఒక సినిమా చేయబోతున్నానని.. అదొక నాలుగైదేళ్ల తర్వాత ఉండొచ్చని సందీప్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరి మీ చిత్రాల్లో లేడీ క్యారెక్టర్ల గురించి విమర్శిస్తుంటారు కదా అని అడిగితే.. తాను ఇప్పుడు చెబుతున్న సినిమా చేసినా సరే వాళ్లకు సంతృప్తి ఉండదని, తనను అప్పుడు కూడా తప్పుబడతారని సందీప్ వ్యాఖ్యానించాడు. సందీప్ లాంటి దర్శకుడి నుంచి ఓన్లీ లేడీ క్యారెక్టర్లతో సినిమా వస్తే అది కచ్చితంగా ఓ సంచలనమే అవుతుంది. మరి నిజంగా అతనీ సినిమా చేస్తాడేమో చూడాలి.
మరోవైపు తాను మహానటి తరహా బయోగ్రఫీ కూడా చేయాలనుకుంటున్నట్లు సందీప్ తెలిపాడు. ఆ సినిమాకు కథ కూడా సిద్ధమవుతోందని.. దానికి ఇప్పుడు కావాలన్నా బడ్జెట్ లభిస్తుందని.. కానీ ఆ సినిమా కోసం తాను ఇంకా టైం తీసుకోవాలనుకుంటున్నానని సందీప్ తెలిపాడు మొత్తం పాజిటివ్ క్యారెక్టర్లతో సినిమాలు తీసే.రాజ్ కుమార్ హిరాని నుంచి తాను ఒక డార్క్ మూవీ ఆశిస్తున్నట్లు చెప్పిన సందీప్.. రామ్ గోపాల్ వర్మ మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచే హిట్ మూవీ తీయాలను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates