మళయాలం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ సలార్ విలన్ వరదరాజ మన్నార్ గానే మనకు దగ్గరయ్యాడు. తర్వాత ది గోట్ లైఫ్ ఆడు జీవితం లాంటివి ప్రశంసలు తెచ్చుకున్నా తెలుగులో ఆడలేదు. తనో దర్శకుడన్న సంగతి తెలిసిందే. చిరంజీవి గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ తీసి వంద కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఇతనే. దీనికి సీక్వెల్ ఎల్2 ఎంపురాన్ మార్చి 27 విడుదలవుతోంది. తెలుగు తమిళం కన్నడతో సహా ఇతర భాషల్లోనూ ఒకేసారి సమాంతరంగా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరి పొరపాటు ఏంటనుకుంటున్నారా.
ఎల్2 ఎంపురాన్ రీమేక్ హక్కులు ఎవరికి ఇవ్వనని పృథ్విరాజ్ చెబుతున్నట్టు మల్లువుడ్ టాక్. అవసరం లేని మార్పులు చేసి చెడగొడుతున్నారని భావించి, దాని బదులు డబ్బింగ్ వెర్షన్ నే మరింత మెరుగ్గా మార్కెటింగ్ చేసుకుంటే ఫలితాలు బాగుంటాయని భావించి ఆ మేరకు బలమైన ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎల్2 ఎంపురాన్ లో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లైని ముఖ్యమైన పాత్ర కోసం తీసుకొచ్చారు. గేమ్స్ అఫ్ థ్రోన్స్ అభిమానులకు ఇతను బాగా సుపరిచితం. మోహన్ లాల్, పృథ్విరాజ్ తో పాటు క్రేజీ క్యాస్టింగ్ ఇందులో పెద్దదే ఉందట.
ఎల్2 ఎంపురాన్ కు తెలుగులో హరిహర వీరమల్లు, రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీ ఉంది. వీటిలో ఎవరైనా తప్పుకునే లేదా వాయిదా వేసుకునే అవకాశాలు కొట్టిపారేయలేం. విక్రమ్ వీర ధీర శూరన్ పార్ట్ 2 సైతం అదే డేట్ మీద కన్నేసింది. ఇంకా అధికారిక ప్రకటన రావాలి. లూసిఫర్ చూసినా చూడకపోయినా ఎల్2 అందరికి అర్థమయ్యేలా తెరకెక్కించామని చెబుతున్న పృథ్విరాజ్ సుకుమారన్ తన సలార్ బ్రాండ్ ని సైతం ప్రమోషన్లలో వాడుతున్నాడు. అన్ని ముఖ్య నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మరి మోహన్ లాల్ ఈసారైనా ఇక్కడ హిట్టు కొడతారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates