Movie News

‘చావా’కే ఇలా ఉంటే.. మరి దానికి?

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘చావా’ సినిమా గత ఐదు రోజులుగా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తోందో తెలిసిందే. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ చిత్రం.. రిలీజ్ తర్వాత ఆ అంచనాలను మించిపోయింది. తొలి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం, నినాదాలు చేయడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఇండియాలోనే ఈ సినిమా రూ.200 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది.

ఐదు రోజుల్లో ఇండియా వసూళ్లు రూ.180 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి. మంగళవారం, వీక్ డేలో ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించడం విశేషం. సోమవారం కన్నా మంగళవారం వసూళ్లు పెరిగాయి. ‘చావా’కు లాంగ్ రన్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో అంచనా వేయడం కష్టంగా ఉంది. ఐతే సామాన్య జనానికి ఎక్కువగా తెలియని శంబాజీ కథను తీస్తేనే జనం ఇంతగా ఊగిపోతున్నారు.

మరి దేశవ్యాప్తంగా, భాష-ప్రాంత భేధం లేకుండా అందరూ ఒక యోధుడిలా చూసే శివాజీ కథను పకడ్బందీగా తీస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఇప్పుడు అందరిలోనూ మొదలవుతోంది. ప్రస్తుతం శివాజీ మీద వేర్వేరుగా సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అన్నింట్లోకి ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టిని శివాజీగా చూపించబోతున్న సందీప్ సింగ్ సినిమా మీద అమితాసక్తి నెలకొంది. ఈ రోజే దాని ప్రి లుక్ రిలీజ్ చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘చావా’ లాగే పకడ్బందీ, భావోద్వేగ భరితంగా శివాజీ కథను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ దగ్గర దానికి హద్దులే ఉండవు. పాన్ ఇండియా స్థాయిలో అది సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

This post was last modified on February 19, 2025 9:44 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago