Movie News

యూత్ అంటే బూతు కాదు బాసూ…

గడ దశాబ్ద కాలంలో ఓటీటీలు, ఇతర కారణాల పుణ్యమా అని.. సినిమాల్లో బోల్డ్ కంటెంట్ డోస్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక లిప్ లాకో.. ఒక ఇంటిమేట్ సీనో ఉంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అవి సర్వసాధారణం అయిపోయాయి. ఇక డైలాగుల్లో డబుల్ మీనింగ్‌లకు హద్దులే లేవు. డైరెక్ట్ బూతులే పెట్టేస్తున్నారు.

‘జబర్దస్త్’ కూడా కొంతమేర ద్వంద్వార్థాలు పెరగడానికి కారణమైంది. వీటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ప్రేక్షకుల తీరు మారిందని, యూత్‌కు ఇవే నచ్చుతాయని అంటున్నారు. కొన్ని సినిమాల ఫలితాలు చూస్తే.. హిట్ కొట్టడానికి బోల్డ్ కంటెంటే కారణమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో సన్నివేశాలు, డైలాగులు శ్రుతి మించిపోతున్నాయి. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ పేరుతో బూతునే నింపి సినిమాలను వదిలేస్తున్నారు.

కానీ అలాంటి సినిమాలను ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ.. లైలా. ‘లైలా’ ట్రైలర్ చూసినపుడే చాలామంది నోరెళ్లబెట్టారు. కొన్ని సన్నివేశాలు.. వాటికి తోడు ‘‘నాది లోపల ఉన్న మేటర్ చూస్తే నీది గుండె ఆగి చస్తాయ్’’.. ‘‘కాయ లేదు పండు ఉన్నాయ్.. పువ్వు లేదు కాయ ఉన్నాయ్.. చమిడి లేదు లమిడి ఉన్నాయ్’’.. ‘‘అన్నీ హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా’’ లాంటి డైలాగులు చూసి వామ్మో వాయ్యో అనుకున్నారు.

ఐతే సినిమా చూశాక.. ట్రైలర్లో చూపించినవి చాలా సింపుల్ అని చెప్పాల్సిందే. రాయడానికి వీల్లేని స్థాయిలో దారుణమైన బూతులతో సినిమాను నింపేశారు. జ్యోతిష్యుడికి చెయ్యి చూపిస్తే రేఖలు అరిగిపోయాయన్నాడు అనడం.. ‘‘ఆకులు ఎందుకు? కొత్తగా మొలిచిన నా.. ’’ లాంటి డైలాగులైతే ఘోరాతి ఘోరం. ఇక ‘పండు’ చుట్టూ ఇందులో నడిపిన కామెడీ గురించి అయితే మాట్లాడుకోవడం కూడా కష్టం.

వీటిని జస్ట్ బోల్డ్ అని సరిపెట్టుకోలేం. చాలా వల్గర్‌గా అనిపించే డైలాగులు.. సీన్లతో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. యూత్ సైతం ఇలాంటి కంటెంట్‌ను ఇష్టపడతారా అన్నది సందేహమే. అందుకే ‘లైలా’కు అంతటి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా హీరో విశ్వక్సేన్‌కు పెద్ద గుణపాఠంగా మారుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on February 15, 2025 2:17 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

36 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago