సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నది ఓపెన్ సీక్రెట్. అఫీషియల్ గా ఇప్పటిదాకా ప్రకటన రానప్పటికీ వేర్వేరు వేదికల్లో, సందర్భాల్లో దీన్ని పదే పదే ఖరారు చేస్తున్నారు.
ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఫైనల్ వెర్షన్ లాక్ కాలేదట. స్క్రిప్ట్ పని జరుగుతోంది. ఏప్రిల్ లేదా మే నుంచి రెగ్యులర్ షూట్ ఉండొచ్చని సమాచారం. దానికన్నా ముందు ఒక అనౌన్స్ మెంట్ టీజర్ ని ప్రత్యేకంగా షూట్ చేసి అభిమానులకు కానుక ఇవ్వాలనేది రావిపూడి ఆలోచన. ఈ ఐడియా చిరుకు బాగా నచ్చడంతో త్వరలోనే తీయబోతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా ఖచ్చితంగా దీన్ని 2026 సంక్రాంతి బరిలో దింపుతానని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యాడట. అంటే కేవలం ఆరేడు నెలల వ్యవధిలో షూట్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు అన్నీ చేసేయాలి. వెంకటేష్ తో ఇలా చేసే అదరగొట్టిన అనిల్ ఇప్పుడు అదే ఫార్ములాని చిరు మీద కూడా వాడబోతున్నాడు.
భీమ్స్ సంగీతంలో రెండు పాటల రికార్డింగ్ ఆల్రెడీ పూర్తయ్యిందని సమాచారం. నిన్న రాఘవేంద్రరావు దీని టైటిల్ సంక్రాంతి అల్లుడు అని క్యాజువల్ గా అన్నారో లేక నిజంగా టీమ్ మనసులో ఆ పేరు ఉందో ఇంకొంత కాలం ఆగిచూస్తే తెలుస్తుంది.
ఈ లెక్కన గత కొన్నేళ్లలో అత్యంత వేగంగా పూర్తయిన సినిమాగా మెగా రావిపూడి మూవీ నిలుస్తుంది. ఇంకా విశ్వంభర విడుదల తేదీ ఖరారు కాలేదు. మే 9 అంటున్నారు కానీ అఫీషియల్ గా చెప్పే దాకా వేచి చూడాలి. చివరి దశలో దర్శకుడు వశిష్ట పనులు వేగవంతం చేశాడు. ఇది థియేటర్లలో అడుగు పెట్టాక చిరు ఫ్రీ అవుతారు.
అక్టోబర్ లేదా నవంబర్ కంతా షూట్ పూర్తి చేసేలా రావిపూడి పక్కా ప్రణాళిక వేసుకుని ఉన్నట్టు సమాచారం. హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక వర్గం తదితర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సంక్రాంతికి వస్తున్నాం టీమ్ లో అధిక శాతం దీనికీ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on February 11, 2025 9:48 am
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…