ఇప్పటితరంలో ఎంతటి అందాల రాశి అయినా రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గత 18 ఏళ్లుగా ఎలాంటి బ్రేక్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది త్రిష.
తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో యూత్‌కు హాట్ ఫెవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. అటు సొంత ఇండస్ట్రీ కోలీవుడ్‌లోనూ ఇప్పటికీ టాప్ స్టార్‌గా కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ తనను పడేయాలంటే… ఇలా ట్రై చేయడంటూ ఓ అదిరే ఆఫర్ ఇస్తోంది.
‘నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు… మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ ఇన్‌స్టా ద్వారా తన ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది త్రిష.
500 పదాల్లో త్రిషపై ఉన్న ప్రేమను, ఆరాధనను అద్భుతంగా వివరించే భావ కవితో త్రిష డేట్ చేస్తుందన్నమాట. త్రిషకు కొన్నాళ్ల కిందట చెన్నైకి చెందిన ఓ బడా బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకుని, త్రిష
అంతకుముందు ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో కూడా డేటింగ్ చేసిన త్రిష… ఇప్పుడు ఇలా ఫ్యాన్స్‌కు ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే, లాక్‌డౌన్‌లో బోర్ కొట్టి… ఇలా ప్లాన్ వేసిందేమో! అని అనుమానిస్తున్నారు కొందరు నెటిజన్లు. 36 ఏళ్ల త్రిష, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని, అందుకే మంచి వ్యక్తి కోసం వెతుకుతోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తున్న త్రిష… ‘నాయకి’ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు.
This post was last modified on April 29, 2020 3:45 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…