కరోనా వైరస్ కారణంగా చనిపోవడం అత్యంత దురదృష్టకరమైన మరణంగా భావిస్తున్నారు అందరూ. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా పార్థివ దేహాన్ని తాకలేని, అంత్యక్రియలు నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితులు కరోనా మృతుల విషయంలో చూస్తున్నాం. ఐతే ప్రస్తుత కరోనా కాలంలో మామూలుగా చనిపోవడం కూడా దురదృష్టమే అని చెప్పాలి. ఎందుకంటే.. లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడ ఆగిపోవడంతో సన్నిహితులు ఎవరైనా చనిపోయినా వెళ్లి కడసారి చూడలేని పరిస్థితి.
గత నెల రోజుల్లో చనిపోయిన అనేకమందిని వారి సంతానం కూడా కడసారి చూడలేని పరిస్థితి తలెత్తింది. స్వయంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇంటి పని మనిషి చనిపోతే.. ఆమె కుటుంబ సభ్యుల దగ్గరికి పార్థివ దేహాన్ని చేర్చలేక అతనే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు.
మృతులు ఎంతటి వాళ్లయినా సరే.. వారికి ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం లేకపోయింది. లెజెండరీ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విషయంలోనూ ఇదే జరిగింది. బుధవారం ఆయన అంత్య క్రియలు చాలా సాధారణంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య అంత్యక్రియలు ముగించారు. ఇర్ఫాన్‌కు బాలీవుడ్లో ఎంతోమంది సన్నిహితులున్నారు. ఆయనపై పరిశ్రమలో అందరికి అపారమైన గౌరవభావం ఉంది.
మామూలు రోజుల్లో అయితే ఇర్ఫాన్ అంత్యక్రియలకు వేలల్లో జనం హాజరయ్యేవాళ్లు. బాలీవుడ్ అంతా ఆయన ఇంటికి వెళ్లేది. కానీ కరోనా కారణంగా ఎవ్వరూ వెళ్లి చూడలేని పరిస్థితి. తమ మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీళ్లు పెట్టుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఆయన ఆప్తుల్ని తీవ్ర వేదనకు గురి చేసేదే.
This post was last modified on April 29, 2020 9:14 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…