మోనాలిసా.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్-ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఒక పేద బంజారా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. కుంభమేళా పుణ్యమా అని నేషనల్ లెవెల్లో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించింది.
పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి సెలబ్రెటీగా మారిపోయింది. ఈ ఫేమ్‌తోనే మోనాలిసా ఇప్పుడు వెండి తెరపైనా కనిపించబోతోంది. తనకు సినిమా ఛాన్స్ లభించడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని ఇప్పటికే ప్రకటించాడు.
ఐతే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకుండా.. తన మాటను నిలబెట్టుకున్నాడు సనోజ్. మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన సనోజ్.. తాజాగా మోనాలిసాను కలిశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో ఉండే ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్లిన సనోజ్.. మోనాలిసాను కలిసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన తర్వాతి ప్రాజెక్ట్ ‘ది స్టోరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసాను ఒక పాత్రలో నటింపజేయనున్నట్లు ఆయన వెల్లడించాడు. సినిమా ఇండస్ట్రీ గురించి మోనాలిసాకు, ఆమె కుటుంబ సభ్యులకు వివరించి.. ధైర్యంగా ఇండస్ట్రీలోకి రావచ్చని సనోజ్ భరోసా ఇచ్చాడు.
కుంభమేళాలో తనకు వచ్చిన పాపులారిటీతో కొన్ని రోజులు మోనాలిసా చిక్కులు తప్పలేదు. ఫొటోలు, వీడియోల కోసం యాత్రికులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆమె వెంట పడడంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్స్ రావడంతో ఆమె జీవితం గొప్ప మలుపు తిరగబోతున్నట్లే.
This post was last modified on January 31, 2025 12:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…