వారం వారం కొత్త సినిమా రిలీజ్ కాగానే థియేటర్లలో వాలిపోయే ప్రేక్షకులు ఇండియాలో కోట్లల్లో ఉన్నారు. నెలకో సినిమా అయినా థియేటర్లో చూసే అలవాటున్న వాళ్ల సంఖ్యా తక్కువేమీ కాదు. థియేటర్లో సినిమా చూడటాన్ని ఒక పండుగలా భావించే వాళ్లందరికీ జీవితంలో ఎప్పుడూ ఎదురు కాని అనుభవాన్ని చూపించింది కరోనా. ఏడు నెలల పాటు థియేటర్లు మూతపడి ఉండటంతో ఇలాంటి ప్రేక్షకులు ఎంతగా ఇబ్బంది పడుతుంటారో చెప్పాల్సిన పని లేదు. మళ్లీ థియేటర్‌కు వెళ్లి మంచి సినిమా చూడాలన్న ఆరాటం వాళ్లందరిలోనూ ఉంది. ఐతే థియేటర్లయితే మళ్లీ తెరుచుకోవడానికి అనుమతులిచ్చారు కానీ.. అనేక షరతులు పెట్టడం, సరైన సినిమాలేవీ రిలీజయ్యే అవకాశాలు లేకపోవడంతో చాలా వరకు థియేటర్లు మూతపడే ఉన్నాయి.
దసరా సీజన్లో అయితే థియేటర్లు నామమాత్రంగా నడవబోతున్నాయన్నది స్పష్టం. ఐతే వచ్చే నెలలో దీపావళి సమయానికి పరిస్థితి మారుతుందని.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తాయని, కొత్త సినిమాలు విడుదలవుతాయని ఆశిస్తున్నారు. ఈ ఆశతోనే వివిధ భాషల్లో కొన్ని కొత్త చిత్రాలను విడుదలకు సిద్ధం చేయాలని చూస్తున్నారు.
లోకల్ సినిమాల సంగతేమో కానీ.. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన టెనెట్ మాత్రం దీపావళికి కచ్చితంగా థియేటర్లలోకి రాబోతోందని సమాచారం. నవంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రెవెన్యూ షేర్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన వీడిపోవడంతో విడుదలకు మార్గం సుగమమైంది.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆయా భాషల్లో పోస్టర్లు కూడా వదిలారు. కాబట్టి నవంబరు 13న మన థియేటర్లలో మన భాషలో టెనెట్ సినిమాను చూడొచ్చన్నమాట.
This post was last modified on October 19, 2020 7:34 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…