సకల జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ చేస్తామని చెప్పిన తెలుగు సినిమా నిర్మాతలు ఏవో అరకొర ఏర్పాట్లు మాత్రమే చేసి షూటింగులు కానిచ్చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్ తెలుగు సినిమా షూటింగ్ స్పాట్స్లో హల్‍చల్ చేస్తోంది.
టక్ జగదీష్ చిత్ర బృందంలో పలువురు కరోనా వైరస్ బారిన పడడంతో షూటింగ్ నిలిపి వేసారు. పది రోజుల క్రితం మొదలైన ఈ చిత్రం షూటింగ్ స్పాట్లో పని చేస్తోన్న వారిలో పలువురికి కరోనా సోకింది. యూనిట్‍లోని ఒక ముఖ్య సభ్యుడికి కూడా కరోనా రావడంతో షూటింగ్‍కి బ్రేక్ ఇచ్చేసారు.
మీడియం బడ్జెట్ సినిమాల షూటింగ్ ఎలా జరుగుతుందనే దానిని బట్టి పెద్ద సినిమాలు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనాని కట్టడి చేయడం అంత సులభం కాదనేది తేలడంతో నవంబరు నుంచి పెట్టుకుందామని అనుకున్న షూటింగులు కాన్సిల్ చేసేసారు.
టక్ జగదీష్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనేది తెలియదు. కరోనా సోకిన వారిని మినహాయించి మిగతా వాళ్లతో షూటింగ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. వాళ్లను తప్పించినా కానీ మరికొందరు దీని బారిన పడే అవకాశమయితే లేకపోలేదు. దీంతో చిత్ర పరిశ్రమ ఇప్పట్లో పూర్వ స్థితికి రాదనేది స్పష్టమైపోయింది.
This post was last modified on October 18, 2020 1:57 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…