వస్తువైనా సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా అవసరం. లేదంటే జనాలు పట్టించుకోకపోయే ప్రమాదముంది. ప్యాన్ ఇండియా మూవీకి ఎన్ని వందల కోట్లు పెట్టినా పబ్లిసిటీ లేకపోతే పబ్లిక్ లైట్ తీసుకుంటుంది. అందుకే రాజమౌళి అంతటి దర్శకధీరుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు.
కాకపోతే హీరో సహకారం చాలా అవసరం. ఇది లేకపోతే ఎవరేం చేయలేరు. విజయ్, అజిత్, నయనతార డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసే నిర్మాతలకు ఇదే పెద్ద సమస్య. షూటింగ్ వరకే తమ బాధ్యత అన్నట్టు వ్యవహరించి దాన్నే పాలసీ మ్యాటర్ గా చెప్పుకునేవాళ్ళు చాలానే ఉన్నారు.
కానీ వెంకటేష్ మాత్రం దీనికి భిన్నంగా కమిట్ మెంట్, ఎనర్జీ అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజై ఇప్పటికి పదమూడు రోజులు దాటేసింది. ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా సరే ఇంత టైం తర్వాత హీరోలు కొత్త ప్రాజెక్టు పనుల్లో బిజీ అయిపోయి ప్రమోషన్లకు రారు.
వచ్చినా ఏదో ఒక స్పీచ్, నాలుగు పొగడ్తలతో మమ అనిపించేసి వెళ్ళిపోతారు. కానీ వెంకీ మామ అలా కాదు. రిలీజ్ కు ముందు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, టీవీ ఛానల్స్ ప్రోగ్రాములు, బాలయ్య రానా లాంటి వాళ్ళు నిర్వహించిన టాక్ షోలు ఒకటా రెండా ఏదీ కాదనకుండా ప్రతిదాంట్లో అలుపు లేకుండా పాల్గొన్నారు.
సక్సెస్ ప్రెస్ మీట్ పెడితే నిర్మాత, హీరోయిన్లు రాలేని పరిస్థితిలో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు తానొక్కరే వచ్చారు. భీమవరంలో రెండు వారాల తర్వాత విజయోత్సవ వేడుక నిర్వహిస్తే వచ్చిన జనాలకు జోష్ ఇవ్వడం కోసం డాన్సులు చేసి, పాటలు పాడి ఎంత చేయాలో అంతా చేశారు.
యువతులైన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి సైతం వెంకీ ఎనర్జీ ముందు తక్కువగా కనిపించడం అతిశయోక్తి కాదు. ఆరు పదుల వయసులో కూడా వెంకటేష్ ఇంత చలాకీగా ప్రమోషన్లలో భాగం కావడం చూస్తే యూత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. నటించడంతో మన పనైపోదు దాన్ని అందరికి చేరవేయడం అసలైన బాధ్యతని.
This post was last modified on January 27, 2025 12:49 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను…
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి…