టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో రాజమౌళి తర్వాత వినిపిస్తున్న పేరు అనిల్ రావిపూడినే. జక్కన్న ప్యాన్ ఇండియా మూవీస్ తో అరుదైన రికార్డులు సాధించారు కానీ అనిల్ మాత్రం పక్కా లోకల్ అంటూ కేవలం తెలుగు వెర్షన్లతో కలెక్షన్ల దుమ్ము దులపడం సంక్రాంతికి వస్తున్నాంతో ప్రత్యక్షంగా చూస్తున్నాం.
మూడుసార్లు వెంకటేష్ ని హ్యాండిల్ చేసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఇప్పటి తరం దర్శకుడు కూడా ఈయన ఒక్కడే. అలాంటి కాంబో తమకూ కావాలని ఇతర హీరోల ఫ్యాన్స్ కోరుకోవడం సహజం. ముఖ్యంగా అదుర్స్ లాంటి మేజిక్ రావిపూడినే చేయగలడని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నమ్మకం.
విచిత్రం ఏంటంటే ఈ కలయిక 10 ఏళ్ళ క్రితం పటాస్ తర్వాతే జరగాల్సింది. డెబ్యూ సినిమా సూపర్ హిట్ అయ్యాక కళ్యాణ్ రామ్ తమ్ముడు తారక్ కో కథ వినిపించాడు అనిల్ రావిపూడి. అయితే ఫైనల్ వెర్షన్ మీద ఏకాభిప్రాయం కుదరలేదు. నెలలు గడిచిపోయాయి. కాస్త ఎక్కువ తుత్తర పడే అనిల్ ఎక్కువ సమయం ఎదురు చూడలేక రాజా ది గ్రేట్ కోసం దిల్ రాజు, రవితేజకు ఓటేశారు.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ తో అవకాశం చేజారిపోయింది. ఒకవేళ ఓపిగ్గా ఎదురు చూసి వేర్వేరు వెర్షన్లతో స్క్రిప్ట్ ని తీర్చిదిద్దుకుని చెప్పి ఉంటే ఈ కలయిక సాధ్యమయ్యేదేమో కానీ మొత్తానికి అనుకోకుండా మిస్ అయ్యింది.
ఇదంతా అనిల్ రావిపూడినే స్వయంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అదుర్స్ లాంటి ప్రయత్నాలు ప్యాన్ ఇండియాకు సెట్ కావని, ఒకవేళ తారక్ తో ఛాన్స్ వస్తే మటుకు ఎంత ఆలస్యమైనా ఎదురు చూసి బెస్ట్ ఇస్తానని చెప్పడం రిలీఫ్.
ప్రస్తుతం చిరంజీవితో చేయబోయే తన తొమ్మిదో సినిమా పనిలో ఉన్న రావిపూడి ఇంకో రెండు మూడు వారాల్లో దానికి సంబందించిన ప్రకటన ఇవ్వబోతున్నాడు. అది కూడా వీడియో ప్రోమో రూపంలో ఉంటుందని టాక్. స్వతహాగా చిరు వీరాభిమాని అయిన ఈ ఎంటర్ టైనింగ్ దర్శకుడు మెగాస్టార్ ని ఎలా చూపిస్తాడోననే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది.
This post was last modified on January 25, 2025 3:21 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…