బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు తనపై మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఫైర్ అవుతోంది. అసలు తాను అనని మాటలను తనకు ఎలా ఆపాదిస్తారంటూ ఆమె వాపోతోంది. తాను చేసినట్లుగా చెబుతున్న కామెంట్లను అసలు తాను ఏ వేదిక మీదా… ఏ ఇంటర్వ్యూలోనూ చేయలేదని కూడా ఆమె నెత్తీనోరూ బాదుకుంటోంది. అప్పటికి ఆ ప్రచారం ఆగకపోవడంతో ఇలాగైతే సరికాదని భావించి,.. తన టీమ్ ను రంగంలోకి దించి… ఆ ప్రచారాన్ని సాగిస్తున్న వారెవరో తేల్చాలంటూ హుకుం జారీ చేసినట్టుగా సమాచారం.
అయినా టబును అంతగా ఆగ్రహానికి గురి చేసిన సదరు ప్రచారం ఏమిటంటే,.. 53 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ పెళ్లి మాటెత్తని టబు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతోంది. తాజాగా అక్షయ్ కుమార్ తో కలిసి ఓ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ లో టబు నటిస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించిన ప్రశ్న ఎదురు కాగా… “పెళ్లిపై నాకు ఆసక్తి లేదు. నా బెడ్ పైకి మాత్రమే ఓ మగాడు కావాలి” అని టబు అన్నారన్నది ఆ ప్రచారం సారాంశం. ఈ వ్యాఖ్యలు విన్నంతనే టబు ఫైర్ అయ్యింది.
అంత బోల్డ్ గా మాట్లాడాల్సిన అవసరం తనకు ఏముందని కూడా టబు ప్రశ్నిస్తోంది. గతంలోనూ తాను ఈ తరహా కామెంట్లు ఏనాడూ చేయలేదని కూడా చెబుతోంది. తాను అనని కామెంట్లను తనకు ఎలా ఆపాదిస్తారని ఆమె వాపోతోంది. ఇప్పటిదాకా చేసిన దుష్ప్రచారం చాలు… ఇకనైనా ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ ఆమె వేడుకుంటోంది.
అయితే ఆమె ఎంత చెప్పినా ఏ ఒక్కరు పట్టించుకున్న దాఖలా కనిపించకపోవడంతో తాజగా ఆమె తన టీమ్ ను రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్డడంతో పాటుగా దుష్ప్రచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటిగానే కొనసాగుతున్న టబు… దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించింది. ప్రత్యేకించి తెలుగు సినిమాల్లో టబు చాలా పాత్రలే పోషించారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోలందరితోనూ టబు కలిసి కనిపించారు. చాలా తెలుగు హిట్ చిత్రాల్లోనూ టబు కనిపించారు. గ్లామరస్ పాత్రలతో పాటుగా నటనా కౌశలం చూపించుకునే కీలక పాత్రల్లోనూ టబు కనిపించారు. అయితే ఎందుకనో గానీ… 53 ఏళ్ల వయసు వచ్చినా.. ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయిన టబు.. పెళ్లి అంటేనే అల్లంత దూరం పరుగెడుతోంది.