ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం టీమ్ బాక్సాఫీస్ సంభవం పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ హాజరయ్యారు. కీలకమైన నిర్మాత దిల్ రాజు మాత్రం రాలేదు. సహజంగానే ఎందుకనే ప్రశ్న ఎదురవుతుందిగా.
దానికి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ మంచి సినిమా ఇంత విజయం సాధించాక దాన్ని జనంలోకి తీసుకెళ్లడం చాలా అవసరమని రాజుగారు చెప్పారు కాబట్టే ఇవి కొనసాగిస్తున్నామని, అన్ని పరిశ్రమల్లోలాగే ఆదాయపు పన్ను దాడులు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు జరుగుతుంటాయని, ఇది సహజమని తేల్చి చెప్పారు.
దిల్ రాజు ఎలాంటి బాధలో లేరని కుండబద్దలు కొట్టేశారు. ఎవరెవరి ద్వారానో కాకుండా నేరుగా తామే సక్సెస్ ని పంచుకోవాలని ఇక్కడికి వచ్చామని అన్నారు. గీతంలో తనతో చదువుకున్న ఫ్రెండ్స్ నీ మీద కూడా ఐటి ఎటాక్స్ జరిగాయాని సరదాగా అడిగారని, కానీ అలాంటిది ఏమి లేదని ఆ టాపిక్ ని రావిపూడి అక్కడితో ముగించారు.
ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం ఇంకో వీకెండ్ ని బలంగా టార్గెట్ చేసుకుంటోంది. కొత్త రిలీజుల మీద ఆశించిన బజ్ లేకపోవడంతో వారాంతంలో మరోసారి భారీ నెంబర్లు నమోదు కావడం ఖాయమని బయ్యర్ల మాట.
ఈ లెక్కన ఫైనల్ రన్ అయ్యేలోపు సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల మార్కు సులభంగా అందుకుంటుంది. అంతకన్నా ఎక్కువే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండు వారాల తర్వాత వచ్చే తండేల్ దాకా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవీ ఉండటం లేదు. సో వెంకటేష్ రావిపూడి ర్యాంపేజ్ కు మరో ఛాన్స్ దొరికినట్టే.
ఏపీలో రేపటి నుంచి సాధారణ టికెట్ రేట్లు అందుబాటులో రానున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరగొచ్చు. విడుదల ముందు నుంచి సక్సెస్ మీట్ దాకా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొన్న హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు బిజీ షెడ్యూల్ వల్ల తాజా ప్రెస్ మీట్ కు హాజరు కాలేకపోయారు.
This post was last modified on January 23, 2025 1:45 pm
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…
బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు…