విపరీతమైన ఆలస్యం, వాయిదాలతో ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకున్న అజిత్ విడాముయార్చి ఫిబ్రవరి 6 విడుదల కానుంది. ఇవాళ వదిలే ట్రైలర్ లో రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని చెన్నై రిపోర్ట్. అయితే ఇక్కడ నాగ చైతన్య ప్రస్తావన ఎందుకంటే తండేల్ ఒక్క రోజు తర్వాత ఫిబ్రవరి 7 రానున్న సంగతి తెలిసిందే.
చైతు కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ. పైగా మొదటిసారి ప్యాన్ ఇండియా స్కేల్ లో అన్ని బాషల ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సో తనకు సోలో రిలీజ్ కావడం చాలా కీలకం. మరి హఠాత్తుగా అజిత్ వస్తే ఎలానేది అక్కినేని అభిమానుల డౌట్.
కానీ ఇక్కడ మరీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకో చూద్దాం. విడాముయార్చి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. హాలీవుడ్ రేంజులో తీశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా గొప్ప మేజిక్ చేయకపోవచ్చు.
కానీ తండేల్ అలా కాదు. ఫక్తు ఎమోషనల్ కం యాక్షన్ లవ్ స్టోరీ. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సముద్రం, సాయిపల్లవి పాత్ర, చైతు మ్యానరిజంస్, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్ షిప్ యాంగిల్ ఇలా బోలెడున్నాయి. ఇవి భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సులభంగా కనెక్ట్ అయ్యేవి.
పైగా తెలుగులో విడాముయార్చికి ఏమంత క్రేజ్ ఉండదు. అజిత్ కి ఇక్కడ పెద్ద మార్కెట్ లేదు. తండేల్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కర్ణాటక, కేరళలోనూ జెండా పాతొచ్చు. ఎటొచ్చి తమిళనాడులో థియేటర్ల పరంగా కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు అంతే.
సంక్రాంతి సినిమాల హడావిడి అయ్యాక తండేల్ ప్రమోషన్లను పెంచబోతున్నారు. ఇప్పటికే రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. సంధ్య థియేటర్ ఉదంతం చల్లబడటంతో గీతా ఆర్ట్స్ టీమ్ పూర్తిగా పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టనుంది. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, మీడియా మీట్లు బోలెడు పెట్టబోతున్నారు. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది కూడా వీటి కోసమే.
This post was last modified on January 16, 2025 11:02 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…