జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్.. ఢిల్లీలో కొత్తగా అతి పెద్ద కార్యాలయాన్ని నిర్మించింది. దీనిని తాజాగా బుధవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. `ఇందిరాగాంధీ భవన్` గా పేరు పెట్టిన ఈ భవన్‌ను 7 స్టార్ హోటల్‌ను తలపించే రీతిలో నిర్మించడం విశేషం. ఎటు చూసినా పాలరాయి.. చెయ్యి వేస్తే మాసిపోతుందేమోనన్నట్టు ఉండడం విశేషం. ఇక, ఏఐ సాంకేతికతతో భవనం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనను కూల వాతావరణంలోనూ ఎలాంటి దృశ్యాలనైనా ఈ కెమెరాలు చిత్రీకరిస్తాయి.
తాజాగా నిర్మించిన ఈ కొత్త కార్యాలయానికి సుమారు 5 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టారని అనధికార అంచ నా. ప్రతి అంతస్తును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద పెద్ద సమావేశ మందిరాలు. లక్ష కార్ల వరకు పార్కింగ్ చేసుకునే అవకాశం. నాలుగు లక్షల ద్విచక్రవాహనాలను కూడా పార్కింగ్ చేసుకునేంత స్థలాన్ని వదిలి పెట్టారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా.. ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 250 కిపైగా వాష్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
50 వరకు డైనింగ్ రూమ్‌లు నిర్మించారు. ఇక్కడే బస చేసేందుకు వీలుగా కూడా పడకలు ఉన్నాయి. కాగా,
ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 50 ఏళ్లుగా ఇక్కడే కాంగ్రెస్ కార్యకలాపాలు జరిగాయి. అయితే.. దీనిని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏ క్షణమైనా సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలియడంతో 9A కోట్లా రోడ్డులో కళ్లు మిరిమిట్లు గొలిపే రీతిలో ఈ భవనాన్ని నిర్మించారు.
ఇక, వాస్తు ప్రకారం కూడా ఈ భవనాన్ని నిర్మించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ స్థాయి కార్మికులను తీసుకువచ్చి.. నిర్మాణాన్ని పటిష్టంగా చేపట్టినట్టు వివరించాయి. తాజాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల హాజరయ్యారు. 2009లో చేపట్టిన ఈ భవన నిర్మాణం 15 ఏళ్ల పాటు సాగడం మరో విశేషం.
This post was last modified on January 16, 2025 10:41 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…