థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే శంకర్ కు దాని వల్ల వచ్చే ఇమేజ్ తో బిజినెస్ చేయొచ్చన్న లైకా ఆలోచన పని చేసేలా కనిపించడం లేదు. తెలుగు సంగతమేమో కానీ తమిళంలో ఆశించిన రన్ దక్కించుకోలేకపోతున్న గేమ్ ఛేంజర్ కు రివ్యూలు, పబ్లిక్ టాక్ బాగానే వచ్చినప్పటికీ అది కలెక్షన్లుగా మారలేదు.
ఓవర్సీస్ లోనూ అద్భుతాలు జరగలేదు. పోటీని తట్టుకోలేక చరణ్ మూవీ ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు హెచ్డి పైరసీ బయటికి రావడంతో నేరుగా నిర్మాణ సంస్థ బరిలో దిగి పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్లాల్సి వచ్చింది.
దీని సంగతలా ఉంచితే ఇప్పుడీ పరిణామాలు ఇండియన్ 3కు ఎంతమేరకు సానుకూలంగా ఉంటాయనేది అనుమానమే. అసలే రెండో భాగం దారుణంగా విఫలమైంది. గేమ్ ఛేంజర్ దానికన్నా చాలా మెరుగ్గా ఉన్నా కమర్షియల్ గా ప్రూవ్ చేస్తోందో లేదో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లోనూ దర్శకుడు శంకర్ ఏకంగా మూడు భాగాల వేల్పరి గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
పలు ఇంటర్వ్యూలలో నొక్కి చెబుతున్నారు. నిర్మాత ఎవరనేది చెప్పడం లేదు కానీ అది కూడా వందల కోట్లతో ముడిపడిన ప్యాన్ ఇండియా మూవీ. చాలా పెద్ద క్యాస్టింగ్ డిమాండ్ చేసే ఆ సినిమా పొన్నియిన్ సెల్వన్ ని మించి ఉంటుంది.
ఇంకొద్దిరోజులు ఆగితే భారతీయుడు 3కి సంబంధించి అసలేం జరుగుతోందనేది బయటికి వస్తుంది. శంకర్ మాత్రం థియేట్రికల్ రిలీజని నొక్కి చెబుతున్నా అదెంత వరకు కార్యాచరణలోకి వస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే దాని మీద బజ్ తేవడం కష్టమే.
ఒకవేళ తగ్ లైఫ్ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ మీద మార్కెట్ చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ సోలోగా శంకర్ బ్రాండ్ మీద అమ్మడం సులభంగా ఉండదు. ఒకపక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లైకా ప్రొడక్షన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కొసమెరుపు ఏంటంటే ఇంకొంత భాగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉందట.
This post was last modified on January 14, 2025 4:32 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…