ద‌మ్ము కొట్టి బాల‌య్య డైలాగ్ చెప్పిన హీరోయిన్

https://www.instagram.com/p/CGUtCS9Hu7H/

ఆషిమా న‌ర్వాల్ అని త‌మిళ క‌థానాయిక‌. సినిమాల్లోనే కాదు.. ఫొటో షూట్ల‌లోనూ హాట్ హాట్‌గా క‌నిపిస్తుంటుంది. క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయింది త‌మిళంలోనే అయినా.. తెలుగులోనూ ఆమె సినిమాలు చేసింది. ఆ మ‌ధ్య జెస్సీ పేరుతో ఒక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఆషిమానే క‌థానాయిక‌గా. దీంతో పాటు నాట‌కం అనే సినిమాలోనూ క‌థానాయిక‌గా న‌టించింది.

త‌మిళంలో రెండు మూడు సినిమాల్లో న‌టించిన ఆషిమా.. ప్ర‌స్తుతం తెలుగులో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. ఈ హాట్ హీరోయిన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో పోస్టు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

ఈ వీడియోలో ఆషిమా నంద‌మూరి బాల‌కృష్ణ డైలాగ్ చెప్పి ద‌మ్ము కొట్ట‌డం విశేషం. బాల‌య్య న‌టించిన శ్రీమ‌న్నార‌య‌ణ సినిమాలో.. డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌.. ఇఫ్ యు ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌.. ట్ర‌బుల్ ట్ర‌బుల్స్ యు. ఐయామ్ నాట్ ద ట్ర‌బుల్‌.. ఐయామ్ ద ట్రూత్ అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని ఆషిమా వ‌ల్లెవేసింది. చివ‌ర్లో ఐయామ్ ద ట్రూత్ అన‌డానికి ముందు సిగ‌రెట్ నోట్లో పెట్టి ఒక ద‌మ్ము లాగించిందామె. స్మోకింగ్ అల‌వాటున్న దానిలా ఆమె ద‌మ్ము లాగ‌డం విశేషం.

ఐతే వీడియో కింద సిగ‌రెట్ తాగ‌డం ప్ర‌మాద‌క‌ర‌మని హెచ్చ‌రిక కూడా జారీ చేసింది. తాను న‌టిస్తున్న తెలుగు సినిమాలో పాత్ర కోసం ఇలా సిగ‌రెట్ తాగ‌డం ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు ఆమె వెల్ల‌డించింది. ఆమె ప‌లికిన బాల‌య్య డైలాగ్‌ను ట్రోల్ కంటెంట్‌గా బాగా వాడుతుంటారు. కాస్త పేరున్న హీరోయిన్ ఈ డైలాగ్‌ను అనుక‌రిస్తే బాల‌య్య ఫ్యాన్స్ ఊరుకునేవాళ్లు కాదేమో.