ఇంకో రెండు రోజుల్లో థియేటర్లలోకి దిగబోతోంది ‘గేమ్ చేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రమిది. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ చేసిన చిత్రం కూడా ఇదే. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైనా.. హైప్ ఏమీ తక్కువ లేదు. ఆ హైప్‌ను ఇంకా పెంచేలా సినిమాలోని విశేషాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఇందులో మోపిదేవి బొబ్బిలి అనే విలన్ పాత్ర చేసిన ఎస్.జె.సూర్య.
తన కెరీర్లో మోపిదేవి పాత్ర చాలా స్పెషల్ అన్న ఎస్.జె.సూర్య.. ఇందులో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రలు మరిన్ని ఉన్నాయన్నాడు.
తన క్యారెక్టర్‌తో పాటు చరణ్ చేసిన అప్పన్న, రామ్ నందన్ పాత్రలు.. అంజలి చేసిన అప్పన్న భార్య పాత్ర.. శ్రీకాంత్ చేసిన క్యారెక్టర్.. అన్నీ వేటికవే ప్రత్యేకమని సూర్య చెప్పాడు. శంకర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పాత్రలను డిజైన్ చేశాడని.. ఈ క్యారెక్టర్ల గురించి విన్నపుడే తాను చాలా ఎగ్జైట్ అయ్యానని.. రేప్పొద్దున థియేటర్లలో ఆయా పాత్రలను చూసి ప్రేక్షకులు ఇదే ఫీలవుతారని సూర్య అన్నాడు.
‘గేమ్ చేంజర్’లో స్పెషల్ ఎపిసోడ్లు చాలా ఉన్నప్పటికీ.. తనకు, శ్రీకాంత్‌కు మధ్య హాస్పిటల్ నేపథ్యంలో వచ్చే సీన్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని.. ఈ సన్నివేశాన్ని సీన్ ఆఫ్ ద ఇయర్‌గా చెప్పొచ్చని సూర్య అన్నాడు. ఇక రామ్ చరణ్ గురించి సూర్య మాట్లాడుతూ.. అతను అన్ని వేరియేషన్లూ చూపించగల గొప్ప ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించాడు. సినిమాలో తమ ఇద్దరి ఫేసాఫ్ సీన్లు అదిరిపోతాయని అతను చెప్పాడు.
శంకర్ దర్శకత్వంలో నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. ఇలాంటి ప్రత్యేకమైన పాత్రతో తన సినిమాలో నటించడం గొప్పగా అనిపిస్తోందని సూర్య అన్నాడు. ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 8, 2025 10:24 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…