లాక్‍డౌన్‍కి ముందు సమంత అంగీకరించిన చిత్రాల్లో ఒకటి అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో బైలింగ్వల్. ఆ చిత్రంలో సమంత ‘మ్యూట్’ క్యారెక్టర్ చేయనుందని వార్తలు కూడా వచ్చాయి. తాప్సీతో ‘గేమ్ ఓవర్’, నయనతారతో ‘మాయ’ చిత్రాలు చేసిన అశ్విన్ డైరెక్షన్‍లో హీరోయిన్ ప్రధాన చిత్రం చేయడానికి సమంత ఎక్సయిట్ అయింది.
నటిగా తన ఖ్యాతిని మరింత పెంచే పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్న తర్వాత సమంత ఒప్పుకునే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆమె చాలా సెలక్టివ్ అయిపోయిన తర్వాత ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్ లాక్‍డౌన్ టైమ్‍లో డ్రాప్ అయినట్టు తెలిసింది. సమంత ఈ చిత్రం వద్దనుకోవడానికి కారణాలు ఏమిటనేది క్లియర్‍గా తెలియకపోయినా కానీ అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ రిజల్ట్ చూసిన తర్వాత సమంత మనసు మార్చుకుందనే టాక్ వినిపిస్తోంది.
నిశ్శబ్దంలో అనుష్క చేసిన పాత్రకు దగ్గరగా వుండడమే కాకుండా కథ కూడా ఇంచుమించు అదే విధంగా అనిపించడంతో సమంత ఈ చిత్రం డ్రాప్ అయిందని, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డ్రాప్ చేసుకుని అశ్విన్ కొత్త కథతో తాప్సీని అప్రోచ్ అయ్యాడని సమాచారం. లాక్‍డౌన్ తర్వాత అక్కినేని హీరోలందరూ తిరిగి సెట్స్కి వెళ్లిపోయారు కానీ సమంత మాత్రం ఇంకా డాబా గార్డెన్, యోగా సెషన్స్ వదిలి బయటకు అడుగు పెట్టనే లేదసలు.
This post was last modified on October 14, 2020 12:09 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…