గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తున్న క్రమంలో హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. అయితే, కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఆ రోడ్డులో అనేక గుంతలున్నాయని, ఐదేళ్లలో గత ప్రభుత్వం ఆ రోడ్డు మరమ్మతులను పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే ఆ ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం నుంచి తగిన సాయం అందించాలని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులకు స్పష్టం చేశానని అన్నారు.
ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ చరణ్ కూడా అభిమానులకు 10 లక్షలు చొప్పున సహాయం ప్రకటించి, వారికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు.
ఇకపై, పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగా ప్రయాణిస్తానని తెలిపారు. జగన్ హయాంలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని, ఆ రోడ్డుపై ప్రయాణించిన ఇద్దరు యువకులు మణికంఠ, శ్రీ చరణ్ దుర్మరణం పాలు కావడంతో ఆవేదనకు లోనయ్యానని పవన్ అన్నారు.గత ప్రభుత్వం కనీసం ఆ రోడ్డుపై గుంతలు పూడ్చలేదని, లైట్లు వేయలేదని, అందుకే ప్రమాదాలు పెరిగాయిని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని, త్వరలోనే పూర్తి చేస్తుందని అన్నారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళాలని గేమ్ ఛేంజర్ ఈవెంట్ ప్రసంగంలో ఒకటికి రెండుసార్లు చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా, మణికంఠ, చరణ్ ల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థఇక సాయం ప్రకటించారు నిర్మాత దిల్ రాజు.
Gulte Telugu Telugu Political and Movie News Updates