ప్రభాస్ కు చెర్రీ ఫోన్… బ్రో కోడ్ బ్రేక్ అయిందా?

మాస్ కా బాప్, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో నాలుగో సీజన్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో సీఎం చంద్రబాబు, తమిళ స్టార్ సూర్య , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, శ్రీలీలతో పాటు పలువురు సినీ తారలు సందడి చేశారు. ఇక, తాజాగా ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరయ్యారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్‌ కోసం బాలయ్య టాక్ షోలో చెర్రీ సందడి చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ లో చరణ్ స్నేహితుడు శర్వానంద్ కూడా సందడి చేయనున్నాడు. ఈ షో సందర్భంగా తన మిత్రుడు, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు చెర్రీ ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. సరదాగా బాలయ్య బాబుతో కలిసి ప్రభాస్ తో చెర్రీ కబుర్లు చెప్పారని తెలుస్తోంది. గతంలో అన్ స్టాపబుల్ షోకు వచ్చిన ప్రభాస్..తన ఫ్రెండ్ చెర్రీకి కాల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభాస్ సీక్రెట్లు, పెళ్లి వంటి విషయాలపై చెర్రీ చేసిన కామెంట్లకు ప్రభాస్ స్పందన వైరల్ అయింది.

‘‘సర్ చరణ్ నా ఫ్రెండ్ కాదు సర్…ఒరేయ్ చరణూ..శాడిస్టు నువ్వు నా ఫ్రెండువా…శత్రువువా…ఇలా తయారయ్యావేంటి డార్లింగ్…పగబట్టేశావేంటి నా మీద…ఓయ్ నువ్వు షోకు వచ్చినప్పుడు నేనే ఫోన్ చేసేది..గుర్తు పెట్టుకో’’ అంటూ ప్రభాస్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

అయితే, మీరు బ్రో కోడ్ మెయింటెన్ చేస్తున్నారని, ఇద్దరూ అండర్ స్టాండింగ్ కు వచ్చేసి మరి ప్రభాస్ కు కాబోయే భార్య పేరు చెప్పడం లేదని బాలయ్య ఆట పట్టించారు. ఈ సారి షోలో చరణ్ కు ఫోన్ చేసి ఆయనపై ప్రభాస్ ఏ విధంగా రివేంజ్ తీర్చుకుంటారోనని ప్రభాస్, చెర్రీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక, ఆ షోలో నువ్వు వచ్చేయ్ అంటూ చరణ్ ను బాలయ్య పిలిచారు..అప్పుడు, తాను ఒక పిలుపు దూరంలో ఉన్నాను..వచ్చేస్తాను అంటూ చరణ్ రిప్లై ఇచ్చారు. ఆ పిలుపు ఇప్పుడు వచ్చిందని, ఆ షోలో చరణ్, బాలయ్య సందడి చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.