ఏ ముహూర్తంలో బాహుబలి జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిందో అప్పటి నుంచి తెలుగు సినిమా జెండా అంతర్జాతీయంగా ఎగరడం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చాక ప్రపంచమంతా రాజమౌళి గొప్పదనం గురించి మాట్లాడుకున్నారు. తాజాగా పుష్ప 2 ది రూల్ ఉత్తరాది రాష్ట్రాల్లో సృష్టిస్తున్న సంచలనం చూస్తూ నార్త్ బయ్యర్లకు నోట మాట రావడం లేదు. బిసి సెంటర్లలో ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ టికెట్ల కోసం జనం కొట్టుకోవడం, బారులు తీరడం చూసి ఇదెక్కడి మాసయ్యా అంటూ షాక్ తో కలెక్షన్లు లెక్కబెట్టుకున్నారు. ఇప్పుడీ సెగలు బాలీవుడ్ లో ఎందరికో తగులుతున్న మాట వాస్తవం.
తాజాగా జరిగిన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బోనీ కపూర్ కు నిర్మాత నాగవంశీ ఇచ్చిన వివరణ వీడియో రూపంలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ మేకర్స్ బాంద్రా, జుహు ప్రాంతాల్లో నివసించే ఖరీదైన ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తున్నారని, కానీ బాహుబలితో మొదలుపెట్టి పుష్ప 2 దాకా క్లాసు మాసుని మెప్పించేలా ఫిలిం మేకింగ్ లో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది టాలీవుడ్డేనని లాజికల్ గా చెప్పడంతో అక్కడున్న వారికి నోటమాట రాకుండా చేసింది. ఒక్క హిందీలోనే పుష్ప 2 మొదటి రోజు 85 కోట్లకు పైగా వసూలు చేయడం చూసి బాలీవుడ్ లో ఆ రోజు రాత్రి చాలా మంది నిద్రపోయి ఉండరని చెప్పడం మాములుగా పేలలేదు.
ఇవన్నీ కాదనలేని వాస్తవం. బోనీ కపూర్ తనవంతుగా ఏదో సమర్ధించుకునే ప్రయత్నం చేశారు కానీ మొఘల్ ఏ అజమ్ తర్వాత బాహుబలినే ఉదాహారణగా ప్రస్తావించడం దగ్గర దొరికిపోయారు. ఒకప్పుడు హిందీలో ఎన్నో మాస్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా ముఖ్యంగా ఓటిటి ఎరా వచ్చాక ఎందరో ప్రొడ్యూసర్లు కేవలం అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. వీటిని చూడలేకే జనాలు నవ్వించి భయపెట్టే హారర్ కామెడీలను నెత్తిన బెట్టుకున్నారు. మార్కోలో అంత వయొలెన్స్ ఉన్నా ఎగబడి చూస్తున్న దానికి కారణం మాస్ కంటెంటే. నాగవంశీ కౌంటర్లకు నెటిజెన్ల నుంచి మంచి మద్దతు దక్కుతోంది.
This post was last modified on December 31, 2024 9:12 am
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…