‘ఆర్ఎక్స్ 100’ తర్వాత చేసే చిత్రానికి క్రేజీ స్టార్ కాస్ట్ వుండాలని అజయ్ భూపతి చాలా ట్రై చేసాడు. ఫామ్‌లో వున్న యువ హీరోలు అందరితోను కథాచర్చలు జరిపినా కానీ వర్కవుట్ అవలేదు. దాంతో రవితేజకు అనుగుణంగా కథలో మార్పులు చేసి మహాసముద్రం అనౌన్స్ చేసాడు. కానీ ఏవో కారణాలతో రవితేజ హ్యాండ్ ఇవ్వడంతో అజయ్ భూపతి ఏడాదికి పైగా హీరో దొరకక ఇబ్బందులు పడ్డాడు.
నాగచైతన్య, సమంత కాంబినేషన్లో ఈ చిత్రం లాంఛ్ చేయడానికి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. హీరోలతో పాటు నిర్మాతలు కూడా వెనక్కు తగ్గడంతో చివరకు శర్వానంద్‌తో సినిమా ఖాయం చేసుకున్నాడు. శర్వానంద్ ఇప్పుడు ఏమంత ఫామ్‌లో లేడు. అతడిని యాక్షన్ నప్పదని ‘రాధా’, ‘రణరంగం’ చిత్రాలు నిరూపించినా కానీ మళ్లీ ఆ జోనర్పై ఒక రాయేసి చూస్తున్నాడు.
క్రేజీ హీరోయిన్ కావాలని అనుకున్న అజయ్ భూపతి హీరోయిన్ పరంగా కూడా రాజీ పడక తప్పలేదు. ఫ్లాప్ హీరోయిన్గా ముద్ర పడిన అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపికయింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగయిన సిద్ధార్థ్‌కి మరో పాత్ర ఇవ్వడంతో కాంబినేషన్ పరంగా ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates