తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఎంతగా మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయో తెలిసిందే. అల్లు అర్జున్ వ్యవహారంతో ఇండస్ట్రీ ఇరుకున పడే పరిస్థితి వచ్చిందని కొందరి అభిప్రాయం.
పెద్ద సినిమాలకు ఇకపై బెనిఫిట్ షోలు, అధిక రేట్లకు అనుమతులు రావని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో టాలీవుడ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ఈ పరిణామాలతో ఫిలిం ఇండస్ట్రీ వెర్సస్ ప్రభుత్వం అన్నట్లుగా తయారైంది. సున్నితంగా మారిన ఈ పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. సున్నితమైన అంశాలపై ‘మా’ సభ్యులు ఎవరూ స్పందించవద్దని ఆయన కోరారు.
‘‘మన కళాకారులు ఎప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. సృజనాత్మకత, సహకారం మీద ఆధార పడి నడుస్తుంది మన పరిశ్రమ. గతంలో ప్రభుత్వాల మద్దతుతో మన ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడడానకి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం ఎంతో ముఖ్యమైంది. దాంతో మొదలుకుని ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సభ్యులంతా సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం, వివాదాస్పద అంశాలపై ఒక వైపే మాట్లాడడం మానుకోవాలి. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, కొన్ని విషాదకరమైనవి. అలాంటి అంశాలపై మాట్లాడ్డం వల్ల సమస్యలను పరిష్కరించడానికి బదులు.. మరింత నష్టం చేకూరుస్తుంది. ఇలాంటి సమయంలో మనకు సహనం, సానుభూతి, ఐకమత్యం అవసరం. మా ఒక పెద్ద కుటుంబం అన్న సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం’’ అని మంచు విష్ణు పేర్కొన్నాడు.
This post was last modified on December 25, 2024 4:52 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…